వారిద్దరికి విశ్రాంతి ఇవ్వడంలో అర్థం లేదు.. ఆడకుంటే ఫాంలోకి ఎలా వస్తారు? ఫైరవుతోన్న టీమిండియా మాజీ క్రికెటర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 15వ సీజన్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో వీరిద్దరూ విశ్రాంతి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వారిద్దరికి విశ్రాంతి ఇవ్వడంలో అర్థం లేదు.. ఆడకుంటే ఫాంలోకి ఎలా వస్తారు? ఫైరవుతోన్న టీమిండియా మాజీ క్రికెటర్లు
Ind Vs Sa Virat Kohli Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: May 18, 2022 | 6:27 PM

రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) ఫాం ప్రస్తుతం టీమిండియాకు ఆందోళన కలిగిస్లోంది. ఐపీఎల్ (IPL 2022) లో టీమిండియాకు చెందిన ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల ప్రదర్శన చాలా దారుణంగా పడిపోయింది. రోహిత్‌-విరాట్‌ల ఫామ్ ఎంత దారుణంగా ఉందంటే వీళ్లిద్దరూ పునరాగమనం ఎలా చేస్తారో కూడా అర్థం కావడం లేదు. ఐపీఎల్ 2022 తర్వాత వచ్చే నెలలో మొదలయ్యే సౌతాఫ్రికా సిరీస్‌లో వీరికి విశ్రాంతి ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడటం ఇరువురు ఆటగాళ్లకు కష్టమే. అయితే ఇద్దరు ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు, ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. ఆడకుండా వీరిద్దరు తిరిగి ఎలా ఫాంలోకి వస్తారంటూ మాజీలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. విశ్రాంతి తీసుకోవడం అర్థం లేనిదని, మ్యాచ్‌లు ఆడిన తర్వాత మాత్రమే తిరిగి ఫామ్‌లోకి వస్తారంటూ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.

Also Read: Team India: టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ.. లిస్టులో ఐదుగురు.. రూ. 8.50 కోట్ల ప్లేయర్‌కు ఈసారైన ఛాన్స్ దక్కేనా?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల IPL 2022 గణాంకాలు నిజంగా షాకిస్తున్నాయి. విరాట్ 13 మ్యాచ్‌ల్లో 20 కంటే తక్కువ సగటుతో కేవలం 236 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌లో కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదైంది. మరోవైపు రోహిత్ శర్మ కేవలం 20.46 సగటుతో 266 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకూడదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

దక్షిణాఫ్రికాపై బలమైన జట్టుతోనే బరిలోకి దిగాలి..

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికాపై టీమిండియా కొత్త ఆటగాళ్లకు బదులు అనుభవజ్ఞులైన జట్టుతో తలపడాలని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, ‘మీరు ప్రయోగాత్మక బృందాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మరోసారి ఆలోచించండి. భారత్ బలహీన జట్టును ఎంచుకుంటే దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. భారత్ జట్టులోని ప్రతి సీనియర్ ఆటగాడిని ఎంపిక చేసుకోవాలి. ఐపీఎల్ తర్వాత టీ20 సిరీస్‌లలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడుతుంటే, ఐపీఎల్ తర్వాత భారత ఆటగాళ్లు విశ్రాంతి ఇవ్వడం సరైనది కాదంటూ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

వెంగ్‌సర్కార్ కూడా..

భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా విరాట్ కోహ్లీకి విశ్రాంతి తీసుకోవద్దని సూచించాడు. IPL 2022 సమయంలోనే విరాట్‌కు విశ్రాంతి అవసరమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై దిలీప్ వెంగ్‌సర్కర్‌కు భిన్నమైన అభిప్రాయం వెలిబుచ్చారు. విరాట్ కోహ్లీ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే పాత ఫామ్‌లోకి తిరిగి వస్తాడని తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు సెలక్టర్లు విరాట్-రోహిత్ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేస్తారా లేక విశ్రాంతి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Team India: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. మరి రాహుల్ ద్రవిడ్ ఏం చేస్తాడంటే?

IPL 2022: చరిత్ర సృష్టించిన రూ. 9 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్‌లో రెండో భారతీయుడిగా రికార్డ్..