రోహిత్ శర్మ ఖాతాలో నాలుగు సెంచరీలు.. సురేష్ రైనా తర్వాత ఈ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసిన లిస్టులో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 2015లో దక్షిణాఫ్రికాపై శతక్కొట్టాడు. హిట్‌మ్యాన్ కేవలం 66 బంతుల్లో 106 చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 160.60 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. అలాగే 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా సారథి రోహత్ కేవలం 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 274.41 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. ఇక 2018లో బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (100 నాటౌట్; 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులు) మూడో సెంచరీ చేసిన రోహిత్.. అదే సంవత్సరం లఖ్‌నవూ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (111 నాటౌట్; 61 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు) నాలుగో సెంచరీ చేశాడు.