- Telugu News Photo Gallery Three big controversies regarding former Indian cricketer Navjot Singh sidhu
Navjot Singh Sidhu: భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దుకి సంబంధించి 3 పెద్ద వివాదాలు..!
Navjot Singh Sidhu: భారత మాజీ ఓపెనర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ల నాటి కేసులో సిద్ధూకు ఈ శిక్ష పడింది.
Updated on: May 19, 2022 | 6:06 PM

భారత మాజీ ఓపెనర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ల నాటి కేసులో సిద్ధూకు ఈ శిక్ష పడింది. 1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో సిద్ధూను దోషిగా తేల్చారు.

సిద్ధూ టెలివిజన్ షోలకు న్యాయనిర్ణేతగా, కొన్నిసార్లు అతిథిగా వస్తూనే ఉన్నారు. ఇది ప్రజలకు చాలా ఇష్టం. కానీ సిద్ధూ చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. క్రికెట్‌కి సంబంధించి సిద్ధూ వివాదాల గురించి తెలుసుకుందాం.

1996లో ఇంగ్లాండ్ పర్యటన నుంచి అప్పటి కెప్టెన్ అజారుద్దీన్‌పై తిరుగుబాటు చేసి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. 2011లో బీసీసీఐ మాజీ సెక్రటరీ జయవంత్ లేలే రాసిన పుస్తకంలో సిద్ధూ ఈ చర్యకు సంబంధించిన వివరాలను తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్, సిద్ధూకు పాత సంబంధం ఉంది. 2018 లో అతను ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి పాకిస్తాన్ వెళ్ళాడు. అది కూడా బాగానే ఉంది కానీ ఆ వేడుకలో అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వాను కౌగిలించుకోవడం ప్రజలకు నచ్చలేదు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యాతగా బాగా నచ్చాడు కానీ అక్కడ కూడా అతను వివాదాల్లో చిక్కుకున్నాడు. ESPN ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొన్నాడు.



