AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Nadella: ఎంఎల్‌సీ లీగ్‌తో క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్‌పైనా కన్నేస్తారా?

Major League Cricket: మేజర్ లీగ్ క్రికెట్ కోసం మొత్తం 120 మిలియన్ డాలర్లు సమకూర్చేందుకు టార్గెట్‌గా అనుకున్నారు. కాగా, ఇప్పటికే 44 మిలియన్​డాలర్లు ఏర్పాటు చేశారు. మరో 12 నెలల్లో మిగిలిన 76 మిలియన్లను సమకూర్చుకునేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

Satya Nadella: ఎంఎల్‌సీ లీగ్‌తో క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్‌పైనా కన్నేస్తారా?
Satya Nadell
Venkata Chari
|

Updated on: May 20, 2022 | 1:55 PM

Share

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల క్రికెట్‌పై కన్నేశాడు. అమెరికాలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభించే మేజర్ లీగ్ క్రికెట్‌(MLC)లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాడు. ఈమేరకు ఇప్పటికే మేజర్ లీగ్ సాకర్, ఫ్రాంచైజీ సీటెల్ సౌండర్స్ పార్ట్ సహ యజమానిగా ఉన్న సత్య నాదెళ్ల ఇన్వెస్టర్ల నుంచి 44 మిలియన్ డాలర్ల పెట్టుబడి కూడా సేకరించారు. ఇందులో ఆయనే కీలకంగా పెట్టుబడులు పెట్టారు. టీ20 తరహాలో ఈ మేజర్ లీగ్ క్రికెట్‌ను నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రపంచ క్రికెట్‌లో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేజర్ లీగ్ క్రికెట్ కోసం మొత్తం 120 మిలియన్ డాలర్లు సమకూర్చేందుకు టార్గెట్‌గా అనుకున్నారు.

Also Read: హక్కుల కోసం దిగ్గజ బాక్సర్‌తో పోరాటం.. ఫెడరేషన్ హ్యాండిచ్చినా తగ్గని నైజం.. కట్‌చేస్తే.. చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దబిడ్డ..

కాగా, ఇప్పటికే 44 మిలియన్​డాలర్లు ఏర్పాటు చేశారు. మరో 12 నెలల్లో మిగిలిన 76 మిలియన్లను సమకూర్చుకునేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మేజర్ లీగ్ క్రికెట్ టీ20 లీగ్‌లో తలపడే జట్ల సంఖ్యను 6 ప్రాంఛైజీలుగా నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా క్రికెట్ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చిన సొమ్ముతో అమెరికాలో భారీ స్టేడియాలు ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో టోర్నీని సక్సెస్ చేయడంతోపాటు, క్రికెట్‌కు నిలయంగా అమెరికాను మార్చాలనుకుంటున్నారు. మెగా లీగ్ క్రికెట్ ఇన్వెస్టర్లలో సత్య నాదెళ్లతోపాటు వెంకీ హరినారాయణ్(మిల్లివేస్ వెంచర్స్​ అండ్ రాకెట్​షిప్​ వీసిలో సహ వ్యవస్థాపకులు), ఆనంద్ రాజరామన్, మడ్రోనా వెంచర్ గ్రూప్​ఎండీ సోమ సోమసెగార్, సంజయ్ గోవిల్​(ఇన్ఫినైట్​ కంప్యూటర్ సోల్యూషన్స్​వ్యవస్థాపకులు), తన్వీర్ అహ్మద్, అనురాగ్ జైన్, బహెటి ఫ్యామిలీ లాంటి ప్రముఖులు కూడా భాగమయ్యారు.

ఐపీఎల్‌పైనా కన్నేస్తారా..

ఇవి కూడా చదవండి

భారతదేశంలో నిర్వహించే​ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్​బాష్ లీగ్‌కు అద్భుత స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే పలు దేశాలు కూడా ప్రత్యేక లీగ్‌లతో క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నాయి. మేజర్ లీగ్ క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టడంతో ఐపీఎల్‌లోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Watch Video: ఇదేందిరయ్యా ఇలా జరిగింది.. తలపట్టుకున్న రషీద్ ఖాన్.. సంతోషంలో మాక్స్‌వెల్.. ఎందుకంటే?

IPL 2022 Playoff Scenario: బెంగళూర్ విజయంతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ఆ రెండు జట్లు.. టాప్ 4లో ఎవరున్నారంటే?