Watch Video: ఈ విజయం అన్‌స్టాపబుల్.. తెలంగాణ బిడ్డను పొగడ్తలతో ముంచెత్తిన ఆనంద్ మహీంద్రా..

ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. ఈ మేరకు మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా బాక్సింగ్ ఛాంపియన్‌ను అభినందించాడు.

Watch Video: ఈ విజయం అన్‌స్టాపబుల్.. తెలంగాణ బిడ్డను పొగడ్తలతో ముంచెత్తిన ఆనంద్ మహీంద్రా..
Nikhat Zareen
Follow us
Venkata Chari

|

Updated on: May 20, 2022 | 1:11 PM

ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌(Womens World Boxing Championships 2022) ఫైనల్లో భారత బాక్సర్ నిఖత్ జరీన్(Nikhat Zareen) విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫ్లైవెయిట్ (52 కిలోలు) విభాగంలో థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌ను 5-0తో ఓడించి సరికొత్త చరిత్రను నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ జరీన్.. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. అయితే, నిఖత్ సాధించిన ఈ అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా అభినందనలు తెలిపారు. తాజాగా ఈ లిస్టులో మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర కూడా చేరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో నిఖత్‌ను అభినందించారు. ‘నువ్వు ఏమిటో, భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పావ్’ అంటూ కొనియాడారు.

“భారత బాక్సర్. ప్రపంచ ఛాంపియన్. 5-0తో విజయం సాధించింది. మీరు ఏమిటో, భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పినందుకు #NikhatZareen ధన్యవాదాలు. అన్‌స్టాపబుల్” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖా కేసీ ఇంతకు ముందు ప్రపంచ టైటిల్‌లు గెలుచుకున్నారు. జరీన్ బంగారు పతకాలతో పాటు, మనీషా మోన్ (57 కేజీలు), అరంగేట్రం పర్వీన్ హుడా (63 కేజీలు) కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

భారత్ నుంచి 12 మంది సభ్యుల బృందం ఈ టోర్నీలో పాల్గొంది. గత టోర్నీతో పోలిస్తే భారత్ పతకాల సంఖ్య తగ్గింది. అయితే నాలుగేళ్ల తర్వాత భారత బాక్సర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మేరీకోమ్ 2018లో భారత్‌కు చివరి స్వర్ణ పతకాన్ని అందించింది.

Also Read: Nikhat Zareen: నీ విజయంతో భారత్ గర్విస్తోంది.. నిఖత్ జరీన్‌ను అభినందించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్

హక్కుల కోసం దిగ్గజ బాక్సర్‌తో పోరాటం.. ఫెడరేషన్ హ్యాండిచ్చినా తగ్గని నైజం.. కట్‌చేస్తే.. చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దబిడ్డ..

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!