FIFA 2022: ఫిఫా 2022 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న ఖతార్.. తగ్గేదే లేదంటూ..

FIFA 2022: ఫిఫా 2022 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న ఖతార్.. తగ్గేదే లేదంటూ..
Fifa 2022

FIFA 2022: ఫిఫా 2022 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఖతార్‌లోని స్టేడియాలు. ఆంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేడియాలను..

Shiva Prajapati

|

May 21, 2022 | 8:29 AM

FIFA 2022: ఫిఫా 2022 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఖతార్‌లోని స్టేడియాలు. ఆంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేడియాలను నిర్మిస్తున్నారు.ఈ ఏడాది నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది ఖతార్‌.. ఇందు కోసం అవసరమైన మౌళిక సదుపాలయాలను ఇప్పటికే సిద్దం చేశారు ఆ దేశ నాయకులు. ఈ ఏడారి దేశంలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది.. ఈ క్రీడోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఎక్కడా రాజీపడకుండా వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

ఖతార్‌లో ఎనిమిది భారీ క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో అతి పెద్దది లుసైల్ ఐకానిక్ స్టేడియం. దాదాపు 80 వేల మంది స్టేడియంలతో కూర్చొని ఆటను తిలకించేందుకు వీటుగా సెంట్రల్ దోహాకు ఉత్తరాన 15 కిలోమీటర్ల దూరంలో తయారవుతోంది ఈ స్టేడియం. వరల్డ్ కప్ తర్వాత ఈ స్టేడియంను కమ్యూనిటీ హబ్‌గా మారుస్తామంటున్నారు ఖతార్‌ అధికారులు.

దోహా నుండి 35 కిలోమీటర్ల దూరంలోని అల్ ఖోర్‌లో 60 వేల మంది క్రీడాభిమానులు తిలకించేందుకు వీలుగా అల్-బైట్ స్టేడియం సిద్ధమవుతోంది. ఇక్కడ సెమీ ఫైనల్స్‌ జరుగుతాయి. మిగతా స్టేడియాలన్నీ 40 వేల మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. దోహా సిటీలో ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం, అల్ తుమామా స్టేడియం, స్టేడియం 974 రెడీ అవుతున్నాయి. అల్ రేయాన్‌లో ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం సిద్ధమవుతున్నాయి.. అల్ వక్రాలో అల్ జనోబ్ స్టేడియం నిర్మించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu