MS Dhoni: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మిస్టర్ కూల్.. వచ్చే సీజన్‌లోనూ..

మ్యాచ్ ప్రారంభంలో ధోని టాస్ గెలిచిన తర్వాత.. కామెంటేటర్ ఇయాన్ బిషప్ రిటైర్మెంట్ గురించి ధోనిని ప్రశ్నించాడు. దీనికి ధోని సమాధానమిస్తూ.. తాను వచ్చే ఏడాది ఆడతానో లేదో కచ్చితంగా చెప్పలేను. కానీ

MS Dhoni: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మిస్టర్ కూల్.. వచ్చే సీజన్‌లోనూ..
Ms Dhoni
Follow us

|

Updated on: May 21, 2022 | 8:49 AM

Good news for CSK fans: క్రికెట్ ప్రపంచంలో మహింద్ర సింగ్ ధోని స్టైలే వేరు.. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడంటే.. అతని కెప్టెన్సీ, ఆటకు అంతా ఫిదా అవుతారు.. అతను తీసుకున్న నిర్ణయం ఏదైనా.. అందర్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. అందుకే ధోని విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయితే.. అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ కెప్టెన్ ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ధోని క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. శుక్రవారం రాజస్థాన్- సీఎస్‌కే మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభంలో ధోని టాస్ గెలిచిన తర్వాత.. కామెంటేటర్ ఇయాన్ బిషప్ రిటైర్మెంట్ గురించి ధోనిని ప్రశ్నించాడు. దీనికి ధోని సమాధానమిస్తూ.. తాను వచ్చే ఏడాది ఆడతానో లేదో కచ్చితంగా చెప్పలేను. కానీ CSK తరఫున చెన్నై హోమ్ గ్రౌండ్ చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల ముందు ఆడాలనుకుంటున్నా.. ఇదే నా లాస్ట్ ఐపీఎల్ అని చెబితే CSK ఫ్యాన్స్కు అన్యాయం చేసినట్లే అవుతుందని ధోని చెప్పాడు. అందుకే 2023 ఐపీఎల్లోనూ ఎల్లో జెర్సీలో కన్పించాలనుకుంటున్నా అంటూ ఎంఎస్ ధోని తన మనసులోని మాటను చెప్పాడు.

వచ్చే ఏడాది ఐపీఎల్ మ్యాచులు అన్ని పట్టణాల్లో జరుగుతాయి. అప్పుడు సొంత గ్రౌండ్లో చెన్నై అభిమానుల మధ్య రిటైర్మెంట్ తీసుకుంటే బాగుటుందని అనుకుంటున్నా.. దీని గురించి ఇప్పుడే చెప్పలేను అంటూ ధోనీ పేర్కొన్నాడు. కాగా.. ధోని ఐపీఎల్ చరిత్రలో చెన్నైకు నాలుగు సార్లు టైటిళ్లను అందించగా.. ఛాంపియన్స్ లీగ్లోనూ చెన్నైను రెండుసార్లు విజేతగా నిలబెట్టాడు.

కాగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిచి.. టీ20 లీగ్‌లో ప్లేఆఫ్స్‌ చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..