AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడి ప్రియులకు బాగా కలిసొచ్చిన ఉగాది..! ఘోరంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

ప్రస్తుతం పసిడి ప్రేమికులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు, మార్చి 20 నాటికి భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే ధరలు దాదాపు 9.77శాతం మేర పడిపోయాయి. నేటి (మార్చి 20, 2026) తాజా ధరలు, తగ్గుదలకు గల కారణాలు కింద ఉన్నాయి.

పసిడి ప్రియులకు బాగా కలిసొచ్చిన ఉగాది..! ఘోరంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
డిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఇతర నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,820 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,600 రూపాయల వద్ద ఉంది. అదే ముంబై, బెంగళూరులలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,670 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,450 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2026 | 7:16 AM

Share

గోల్డ్‌ లవర్స్‌కి సూపర్‌ గుడ్‌న్యూస్‌.. నేడు మార్చి 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర, ఒక రోజు క్రితం రోజు స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ, ఒక్కరోజులోనే యూటర్న్ తీసుకున్నాయి. ఒకేరోజున అమాంతంగా కుప్పకూలిపోయాయి.

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,50,270లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,37,740లకు చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,630 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,990 గా ఉంది.

అటు ఆర్థిక రాజధాని ముంబైలోనూ పసిడి ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,420, 22 క్యారెట్ల ధర రూ.1,37,890లు గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర భారీగానే దిగి వచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 లకు చేరింది.

ఇక వెండి విషయానికి వస్తే, భారతదేశంలో వెండి ధరలు నగరాల వారీగా మారుతూ ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో (హైదరాబాద్, చెన్నై) వెండి ధర ఉత్తరాది నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. భారతదేశ బులియన్‌ మార్కెట్లో నేటి వెండి ధర గ్రాము రూ.264.90 లు ఉండగా, కిలో రూ.2,64,900.లకు దిగి వచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర