IPL 2022: రాజస్థాన్‌ రాయల్స్‌ కప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ.. ఎందుకో తెలుసా..?

IPL 2022: ఐపీఎల్‌ 2022 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పుడు జట్టులో ఏదో మార్పు చేస్తోందనే అనుమానం అందరికి వచ్చింది.

IPL 2022: రాజస్థాన్‌ రాయల్స్‌ కప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ.. ఎందుకో తెలుసా..?
Rajasthan Royals
Follow us
uppula Raju

|

Updated on: May 21, 2022 | 5:18 PM

IPL 2022: ఐపీఎల్‌ 2022 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పుడు జట్టులో ఏదో మార్పు చేస్తోందనే అనుమానం అందరికి వచ్చింది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఐపీఎల్ 2008లో చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఇప్పుడు మరోసారి రెండో టైటిల్‌కు చేరువైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. రాజస్థాన్ ఇప్పుడు 18 పాయింట్లతో, లక్నో సూపర్ జెయింట్స్ కంటే మెరుగైన రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ జట్టు ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలను పొందబోతోంది. టైటిల్ కోసం అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. సంజూ శాంసన్ జట్టు ఛాంపియన్‌గా మారుతుందో లేదో మరికొద్ది రోజుల్లో తేలనుంది. జట్టు బలాబలాల గురించి ఆలోచిస్తే విజయ అవకాశాలు ఎక్కువే అని చెప్పవచ్చు.

1. ఈ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ అత్యంత బ్యాలెన్స్‌డ్ జట్టుగా కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లు అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఫీల్డింగ్‌లో రాజస్థాన్ ప్రదర్శన రాయల్‌గా ఉంది. ఇది కాకుండా జట్టులో చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వారు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లోలో బాగా రాణిస్తారని జట్టు యాజమాన్యం నమ్ముతోంది.

2. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్న ఆటగాళ్లు రాజస్థాన్‌ జట్టు సభ్యులే. బట్లర్ 629 పరుగులు, చాహల్ 26 వికెట్లు తీశారు. ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఇలాగే కొనసాగితే ప్రత్యర్థి జట్టు తోడ ముడిచినట్లే.

ఇవి కూడా చదవండి

3. గత 3 నుంచి 4 మ్యాచ్‌ల్లో జోస్ బట్లర్ సరిగ్గా ఆడటం లేదు. అయితే బట్లర్‌ ఆడకున్నా జట్టు విజయాలలో ఎలాంటి మార్పులేదు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. బ్యాటింగ్‌లో అశ్విన్‌ ప్రదర్శన అద్భుతంగా ఉంది.

4. టోర్నమెంట్‌లోని అన్ని జట్ల కంటే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చాలా పటిష్టమైనది. అంతేకాదు చాలా అనుభవంతో కూడుకున్నది. యుజ్వేంద్ర చాహల్, ఆర్ అశ్విన్ స్పిన్, ట్రెంట్ బౌల్ట్, కృష్ణ పేస్‌తో బౌలింగ్‌ ద్వయం అద్భుతంగా ఉంది. అలాగే డెత్ ఓవర్‌లో ఒబెడ్ మెక్‌కాయ్ స్లో బంతులు ఈ జట్టు బలాన్ని మరింత పెంచుతాయి. పవర్‌ప్లే అయినా మిడిల్ ఓవర్ అయినా డెత్ ఓవర్ అయినా రాజస్థాన్ బౌలర్లు మూడు దశల్లో అద్భుతాలు చేయగలరు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి