Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Foods: యవ్వనంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన 6 యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!

Anti Aging Foods: కరోనా సమయంలో నానాటికీ పెరుగుతున్న ఒత్తిడి, కాలుష్యం వల్ల యవ్వనంగా కనిపించడం కొంచెం కష్టమే. కానీ ప్రజలు ఇప్పటికీ యాంటీ

Anti Aging Foods: యవ్వనంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన 6 యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
Anti Aging Foods
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2022 | 6:35 PM

Anti Aging Foods: కరోనా సమయంలో నానాటికీ పెరుగుతున్న ఒత్తిడి, కాలుష్యం వల్ల యవ్వనంగా కనిపించడం కొంచెం కష్టమే. కానీ ప్రజలు ఇప్పటికీ యాంటీ ఏజింగ్ సొల్యూషన్స్ కోసం ఎదురు చూస్తున్నారనేది మాత్రం నిజం. యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నీరు, అవసరమైన పోషకాలతో నిండిన కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే కనీసం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించవచ్చు. యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్‌లు తాత్కాలికంగా పనిచేస్తాయి కానీ ఇవి మంచి కంటే ఎక్కువగా హాని చేస్తాయని గుర్తుంచుకోండి. సహజసిద్దమైన మెరుపుని పొందాలంటే డైట్‌లో కొన్ని ఆహారాలని చేర్చుకోవాలి. అలాంటి జాబితాని ఒకసారి పరిశీలిద్దాం.

1. క్యాబేజీ

క్యాబేజీలో ఇండోల్-3, కార్బినాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ పరిమాణాన్ని సరిచేస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. క్యాబేజీలోని విటమిన్ ఎ, విటమిన్ డి చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. హానికరమైన సూర్య కిరణాల నుంచి మనలను రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

2. క్యారెట్లు

క్యారెట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. క్యారెట్‌లోని బీటా కెరోటిన్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్లలో విటమిన్‌ ఏ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.

3. ద్రాక్ష

ద్రాక్షలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ద్రాక్ష చర్మంపై ఏర్పడే మంటను తొలగిస్తుంది. హానికరమైన సూర్య కిరణాల నుంచి మనలను రక్షిస్తాయి.

4. ఉల్లిపాయలు

ఉల్లిపాయలు రక్తాన్ని పల్చగా మార్చడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి పనిచేస్తాయి. శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ అయిన క్వెర్సెటిన్‌ ఉల్లిపాయలలో సమృద్ధిగా లభిస్తుంది. వెల్లుల్లి వలె ఉల్లిపాయలు శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

5. టొమాటో

టమోటలో లైకోపీన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడే అద్భుతమైన యాంటీఆక్సిడెంట్. టొమాటోలో శక్తివంతమైన యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి.

6. బచ్చలికూర

బచ్చలికూరలో శక్తివంతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. బచ్చలికూరలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి