Nails Change Color: గోళ్లు రంగుమారితే చాలా ప్రమాదం.. ఆరోగ్య పరిస్థితి సులువుగా తెలుసుకోవచ్చు..!

Nails Change Color: కెరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన జుట్టు, గోళ్లకు చాలా ముఖ్యమైనది. మన శరీరంలో పోషకాల కొరత ఏర్పడినప్పుడు లేదా

Nails Change Color: గోళ్లు రంగుమారితే చాలా ప్రమాదం.. ఆరోగ్య పరిస్థితి సులువుగా తెలుసుకోవచ్చు..!
Nails Change Color
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2022 | 5:04 PM

Nails Change Color: కెరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన జుట్టు, గోళ్లకు చాలా ముఖ్యమైనది. మన శరీరంలో పోషకాల కొరత ఏర్పడినప్పుడు లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కెరాటిన్ ప్రభావితమవుతుంది దీని ప్రభావం గోళ్లపై కనిపిస్తుంది. ఈ సందర్భంలో గోళ్ల రంగు మారడం ప్రారంభమవుతుంది. పూర్వ కాలంలో చాలా మంది నిపుణులు కళ్ళు, గోర్లు, నాలుకను చూసి వ్యాధిని నిర్ధారించేవారు. మన గోళ్లను చూసి కాలేయం, గుండె, ఊపిరితిత్తుల పరిస్థితిని తెలుసుకోవచ్చు. మీ గోరు రంగు మారుతున్నట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి.

1. గోళ్లు పసుపు రంగులోకి మారితే..

మీ గోళ్ల రంగు పసుపు రంగులోకి మారినట్లయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అర్థం. అంతే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్, సిర్రోసిస్ వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి.

ఇవి కూడా చదవండి

2. గోళ్ళపై తెల్లటి మచ్చలు..

గోళ్లపై తెల్లమచ్చల సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఈ మచ్చల పరిమాణం పెరిగితే శరీరంలో సమస్య ఉన్నట్లే. అది కాలేయానికి సంబంధించిన సమస్య అయి ఉంటుంది.

3. గోళ్లు నీలి రంగులోకి మారితే..

కొన్నిసార్లు గోళ్లలో నీలిరంగు కనిపిస్తుంది. అంటే శరీరంలో ఆక్సిజన్‌​కొరత ఉందని అర్థం. ఇది ఊపిరితిత్తులు లేదా గుండె జబ్బులను సూచిస్తుంది. మరోవైపు గోర్లు పొడిగా మారి విరిగిపోతున్నట్లయితే అది శరీరంలో పోషకాల కొరతను సూచిస్తుంది. అలాగే ఇది థైరాయిడ్ వల్ల కూడా అవుతుంది.

4. గోళ్లు నల్లగా మారితే..

గోళ్లు నల్లగా మారితే చర్మ క్యాన్సర్‌ అని అర్థం చేసుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గోళ్లు నల్లగా మారతాయి. చాలా సార్లు గాయం కారణంగా గోరు కింద రక్త నాళాలు పగిలిపోయి రక్తం నల్లగా మారుతుంది. అలాగే సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా పెరగడం వల్ల కొన్నిసార్లు గోళ్లు నల్లగా లేదా ఆకుపచ్చగా మారుతాయి.

5. గోళ్లు తెల్లగా మారితే..

మీ గోళ్ల రంగు చాలా తెల్లగా ఉంటే అది రక్తహీనత, గుండె వైఫల్యం, కాలేయ వ్యాధి, పోషకాహార లోపం మొదలైన వాటికి సంకేతం కావొచ్చు. అదే సమయంలో గోళ్లలోని చారలు విటమిన్-బి, బి-12, జింక్ లోపాన్ని సూచిస్తాయి. మీ గోర్లు సగం తెలుపు, సగం గులాబీ రంగులో ఉంటే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..