Summer Super Foods: ఎండాకాలం ఎనర్జిటిక్‌గా హైడ్రేట్‌గా ఉండాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తినాల్సిందే..!

Summer Super Foods: వేసవిలో ఎండ, చెమట నుంచి ఉపశమనం పొందాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుస్తుల దగ్గర నుంచి ఆరోగ్యకరమైన ఆహారం

Summer Super Foods: ఎండాకాలం ఎనర్జిటిక్‌గా హైడ్రేట్‌గా ఉండాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తినాల్సిందే..!
Summer Super Foods
Follow us

|

Updated on: May 18, 2022 | 8:42 AM

Summer Super Foods: వేసవిలో ఎండ, చెమట నుంచి ఉపశమనం పొందాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుస్తుల దగ్గర నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వరకు అన్నిటిపై శ్రద్ధ వహించాలి. ఈ సీజన్‌లో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి పని చేస్తాయి. అలాంటి వాటిలో పుచ్చకాయ, దోసకాయ, పుదీనా మొదలైనవి ఉంటాయి. ఇవి కాకుండా మరికొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో పెరుగుతో చేసిన లస్సీ, మజ్జిగ తాగితే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెరుగుతో అనేక ఇతర వంటకాలని కూడా తయారుచేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

2. పుదీనా

పుదీనా శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో పుదీనా మజ్జిగ లేదా పుదీనా చట్నీ తీసుకోవచ్చు. ఇది వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. కొబ్బరి నీరు

కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పొట్టను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.

4. పుచ్చకాయ

పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది మీకు చాలా కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మీరు దీన్ని చాట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం పుచ్చకాయలో ఎండుమిర్చి, ఉప్పు, చాట్ మసాలా వేసుకొని తినాలి.

5. దోసకాయ

దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని సలాడ్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. వేసవిలో మీ ఆహారంలో దోసకాయను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది అన్ని వయసుల వారికి నచ్చుతుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.