Spice Prices: కొండెక్కిన మసాల దినుసుల ధరలు.. స్పైసీ ఫుడ్‌ తినడం ఇప్పుడు ఖరీదైనది..!

Spice Prices: ఆహార ధాన్యాలు, వంటనూనె, గ్యాస్‌ ధరలు పెరగడం వల్ల ఇప్పటికే సామాన్యుడు తట్టుకోలేకపోతున్నాడు. తాజాగా మసాల దినుసుల ధరలు

Spice Prices: కొండెక్కిన మసాల దినుసుల ధరలు.. స్పైసీ ఫుడ్‌ తినడం ఇప్పుడు ఖరీదైనది..!
Follow us
uppula Raju

|

Updated on: May 18, 2022 | 8:37 AM

Spice Prices: ఆహార ధాన్యాలు, వంటనూనె, గ్యాస్‌ ధరలు పెరగడం వల్ల ఇప్పటికే సామాన్యుడు తట్టుకోలేకపోతున్నాడు. తాజాగా మసాల దినుసుల ధరలు పెరగడంతో ఇష్టమైన కూర కూడా తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. కొత్తిమీర ధర దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. మిర్చి ధర 50 శాతం పెరిగింది. జీలకర్ర, పెసర, మెంతికూర ధరలు ఊహించని విధంగా ఉన్నాయి. గత వారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వాస్తవాలని వెల్లడిస్తున్నాయి . గత ఏడాది కంటే ఈ ఏడాది మసాలా దినుసుల దిగుబడి తక్కువగా ఉంటుందని అంచనా. దీంతో సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఆందోళన కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తిమీర ఉత్పత్తి దాదాపు 80 వేల టన్నులు తగ్గుతుందని, జీలకర్ర ఉత్పత్తి కూడా దాదాపు 70 వేల టన్నులు తగ్గవచ్చని అంచనా. మిర్చి, కారం, ఏలకుల దిగుబడి భారీగా తగ్గిపోయింది.

కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయ మసాలా దినుసులకు డిమాండ్ పెరిగింది. దీంతో సుగంధ ద్రవ్యాలు అధిక ధరలకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో పెరిగిన విదేశీ డిమాండ్ మసాలా దినుసుల ధరలకు మరింత ఆజ్యం పోస్తోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దేశం నుంచి 1.2 మిలియన్ టన్నుల సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేశారు. ఎర్ర మిరపకాయ, జీలకర్ర, పసుపు, ఎండు అల్లం, కొత్తిమీర, సోంపు ఈ ఎగుమతిలో ఎక్కువగా ఉన్నాయి.

గోధుమ పిండి చాలా ఖరీదైనదిగా మారడంతో ప్రభుత్వం గోధుమల ఎగుమతిని నిషేధించింది. దీనితో పాటు, ఎడిబుల్ ఆయిల్ దిగుమతిని పెంచడానికి అనేక రకాల సుంకాలు రద్దు చేశారు. కానీ ప్రభుత్వ నిత్యావసర వస్తువుల జాబితాలోకి సుగంధ ద్రవ్యాలు రావు. ఈ పరిస్థితుల్లో వాటి ధరను తగ్గించేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆశ లేదు. అంటే వీటి ధరలు ఇప్పట్లో తగ్గడానికి అవకాశం లేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి