AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh Crisis: లంక బాటలో బంగ్లాదేశ్.. దివాలా అంచున ఆర్థిక వ్యవస్థ.. వాటిపై ఇప్పటికే నిషేధం..

మెున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, నిన్న ప్రఖ్యాత ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ సాక్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోదని అన్నాయి. ఇదే తరుణంలో ఇప్పటికే పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. తాజాగా..

Bangladesh Crisis: లంక బాటలో బంగ్లాదేశ్.. దివాలా అంచున ఆర్థిక వ్యవస్థ.. వాటిపై ఇప్పటికే నిషేధం..
Bangladesh
Ayyappa Mamidi
|

Updated on: May 18, 2022 | 7:36 AM

Share

Bangladesh: మెున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, నిన్న ప్రఖ్యాత ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ సాక్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోదని అన్నాయి. ఇదే తరుణంలో ఇప్పటికే పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. తాజాగా.. బంగ్లాదేశ్ సైతం ఈ జాబితాలో చేరబోతోంది. కేవలం రానున్న 5 నెలల కాలంలో ఆ దేశం దివాలా తీసే అవకాశం ఉంది తెలుస్తోంది. అక్కడ కూడా విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటున్నాయి. ఈ తరుణంలో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం విదేశాల నుంచి ఏసీలు, ఖరీదైన వాహనాలతో పాటు ఇతర ఎలక్ట్రిక్ వస్తువుల దిగుమతులను నిషేధించింది. పరిస్థితులు చేజారిపోకముందే చక్కదిద్దాలను ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా ఇంధనం, పెరిగిన ఆహార ధరలు, దిగుమతుల కారణంగా కరెన్సీ నిల్వలు క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చులు పెరిగిన రీతిలో ఎగుమతుల వల్ల వచ్చే ఆదాయం పెరగలేదని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం కంటే దిగుమతులు ఏకంగా 54 శాతం బంగ్లాదేశ్ లో పెరిగాయి.

అంతర్జాతీయంగా డాలర్ విలువ బలపడటం వల్ల ఎగుమతులు పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం తగ్గింది. డాలర్ల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా వాణిజ్యలోటు కూడా భారీగానే పెరుగుతోంది. డాలర్ తో టాకా మారకపు రేటు ప్రస్తుతం 86.7 వద్ద ఉంది. దిగుమతల సమయంలో కరెన్సీ మార్పిడి చేయటం వల్ల ఒక్కో డాలర్ కు 95 టాకాలు చెల్లించాల్సి వస్తోంది. దీని వల్ల దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఖరీదుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు ఆ దేశం.. విదేశీ ప్రయాణాలను సైతం నిషేధించినట్లు తెలుస్తోంది. మారక నిల్వలపై సరైన వివరాలు ఇవ్వాలని మరో పక్క ఐఎమ్ఎఫ్ సైతం బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ పరిస్థితులు రానున్న కాలంలో ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని తెలుస్తోంది. డాలర్లను ఎక్కువగా ఆ దేశం ఇంధన కొనుగోళ్ల కోసం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఈ లెక్కన ఇంచుమించుగా అక్కడ కూడా శ్రీలంక పరిస్థితులే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చిన్న దేశీలకు ఇలాంటి పరిస్థితులు రావటానికి చైనా వేసిన అప్పుల ఉచ్చే కారణమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.