Today Gold Rate: మహిళకు షాకిచ్చిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి..!

Gold Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ..

Today Gold Rate: మహిళకు షాకిచ్చిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి..!
Follow us

|

Updated on: May 18, 2022 | 6:26 AM

Gold Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. ఈ రోజు 10 గ్రాముల ధరపై భారీగానే పెరిగింది. అలాగే వెండి కూడా దూసుకుపోయింది. దేశీయంగా తులం బంగారంపై రూ.330 వరకు పెరుగగా, కిలో వెండిపై ఏకంగా రూ.2,150 వరకు పెరిగింది. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక బుధవారం (May 18)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,780 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,970 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఇక దేశీయంగా బంగారం ధరలు దూసుకుపోతుంటే.. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలో బంగారంపై రూ.2,150 వరకు ఎగబాకుతోంది. అయితే ఈ ధర పెరుగుదల ప్రాంతాలను బట్టి ఉంటుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, విజయవాడలో రూ.66,600 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.65,600 ఉండగా, ముంబైలో రూ.61,550 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.61,550 ఉండగా, కోల్‌కతాలో రూ.61,550 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,600 ఉండగా, కేరళలో రూ.65,600 వద్ద కొనసాగుతోంది.

ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. బంగారం, వెండి కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఈ బంగారం, వెండి ధరలు వివిధ వెబ్‌సైట్ల అప్‌డేట్స్ ఆధారంగా ఇవ్వబడుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు