Ethos IPO: లగ్జరీ వాచ్ తయారీ కంపెనీ ఐపీవో నేడే ప్రారంభం.. ఇష్యూకి సంబంధించిన పూర్తి వివరాలు..
Ethos IPO: దేశంలో గత కొంతకాలంగా ఐపీవోల మానియా కొనసాగుతోంది. వరుసగా అనేక కంపెనీలు తమ కంపెనీలను దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేస్తున్నాయి. తాజాగా..
Ethos IPO: దేశంలో గత కొంతకాలంగా ఐపీవోల మానియా కొనసాగుతోంది. వరుసగా అనేక కంపెనీలు తమ కంపెనీలను దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేస్తున్నాయి. నిన్న దేశంలోనే అతి పెద్ద ఐపీవో ఎల్ఐసీ షేర్ లిస్టింగ్ జరగగా.. ఈ రోజు Ethos కంపెనీ ఐపీవో ఇష్యూ ప్రారంభమైంది. ఈ కంపెనీ ఖరీదైన లగ్జరీ వాచ్ బ్రాండ్ గా ఉంది. ప్రస్తుతం ఐపీవో ద్వారా కంపెనీ సుమారు రూ.472 కోట్ల రూపాయలను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం షేర్ విక్రయ ధరను రూ.836 నుంచి రూ.878 మధ్య నిర్ణయించింది. ఈ మెుత్తం ఇష్యూలో రూ.97.29 కోట్ల రూపాయల విలువైన ఆఫర్ ఫర్ సేల్ కూడా కలిపి ఉంటుంది. ఇంపటికే యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.142 కోట్ల విలువైన షేర్లను ఎలాట్ చేసింది.
ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో లగ్జరీ వస్తువుల రిటైల్ అమ్మకాల్లో సుమారు 13 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీ లాభాల మార్జిన్ 2021 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.50 శాతంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఈ కంపెనీ షేర్ ఇష్యూ వ్యాల్యుయేషన్ కొంత ఎక్సెన్సివ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం సుమారు రూ. 386 కోట్లుగా ఉంది. ఈ కాలానికి నికర లాభం రూ.5.80 కోట్లుగా ఉంది. ఇష్యూ పూర్తయ్యాక ఐపీవో అప్లై చేసినవారికి మే 27న షేర్లు డీమాట్ అకౌంట్లలో జమ కానున్నాయి. షేర్లు రాని వారి డబ్బు మే 26న వాపసు వస్తాయి. ఈ కంపెనీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ నెల 30న లిస్టింగ్ కానుంది. ఈ ఇష్యూలో 35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు దక్కనున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..