World Hypertension Day 2022: హైబీపీ పేషెంట్లు మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!
World Hypertension Day 2022: హై బీపీని వైద్య భాషలో హైపర్‌టెన్షన్ అని పిలుస్తారు. దీనివల్ల ఒక వ్యక్తి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. అధిక బీపీతో బాధపడుతున్న
World Hypertension Day 2022: హై బీపీని వైద్య భాషలో హైపర్‌టెన్షన్ అని పిలుస్తారు. దీనివల్ల ఒక వ్యక్తి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. అధిక బీపీతో బాధపడుతున్న రోగులు వారి బరువును కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారపు అలవాట్లను పాటించాలని చెబుతున్నారు. బీపీ పేషెంట్లకు కొన్ని వ్యాయామాలు ప్రాణాంతకంగా మారుతాయి. ఈ ప్రమాదకరమైన సమస్యను నివారించేందుకు ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హై బీపీ పేషెంట్లు చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం.
1. వెయిట్ లిఫ్టింగ్, స్కూబా డైవింగ్, స్కై డైవింగ్, స్క్వాష్, స్ప్రింటింగ్ వంటి వ్యాయామాలు అధిక BP రోగులకు ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తాయి. వీటిని చేయడం వల్ల బీపీ వేగంగా పెరుగుతుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఏదైనా వ్యాయామం చేస్తున్నప్పుడు తలనొప్పి, తల తిరగడం, అలసట, వాంతులు వంటి సమస్య ఉంటే వెంటనే వ్యాయామాన్ని ఆపేయాలి. హై బీపీ ఉన్నవారు ఏ వ్యాయామాన్నైనా సరే నిపుణులను సంప్రదించిన తర్వాతే మాత్రమే చేయాలి.
2. మీరు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. WHO ప్రకారం చాలా మంది ప్రజలు రోజుకు 9 నుంచి 12 గ్రాముల ఉప్పును తీసుకుంటారు. కానీ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఎముకలు బలహీనపడతాయి. WHO ప్రకారం ప్రతి వ్యక్తి రోజులో 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు.
3. అధిక BP రోగులకు మద్యపానం, ధూమపానం హానికరం. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. లేదంటే ఇవి సమస్యను పెంచి ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీస్తుంది.
4. వేయించిన ఆహారాలు, జంక్‌ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం రెండూ గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి బీపీ పేషెంట్లు వీటిని పూర్తిగా విస్మరించాలి.
5. మీరు హై బీపీ పేషెంట్లు అయితే డాక్టర్ సూచించిన మందులని క్రమం తప్పకుండా తీసుకోవాలి. బీపీని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. నిపుణులను సంప్రదించి ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్‌లు చేయించుకుంటే మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి