AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Blood Pressure: అధిక రక్తపోటు ప్రమాదకరం.. తగ్గించుకోవాలంటే ఏవి తినాలి.. ఏవి తినకూడదు..!

High Blood Pressure: అధిక రక్తపోటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని వెంటాడుతోంది. దీని కారణంగా రక్త ప్రవాహంపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో తలనొప్పి..

High Blood Pressure: అధిక రక్తపోటు ప్రమాదకరం.. తగ్గించుకోవాలంటే ఏవి తినాలి.. ఏవి తినకూడదు..!
Subhash Goud
|

Updated on: May 17, 2022 | 1:04 PM

Share

High Blood Pressure: అధిక రక్తపోటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని వెంటాడుతోంది. దీని కారణంగా రక్త ప్రవాహంపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో తలనొప్పి, మైకం, హృదయ సంబంధ వ్యాధులు చుట్టుముట్టి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అధిక బీపీ కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధిని తగ్గించడాని మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మన జీవనశైలిలో కొన్ని మార్పుల చేసుకుంటే ఎలాంటి మందులు వాడకుండానే నయం చేసుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. అధిక రక్తపోటును ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.

  1. ఉప్పును తక్కువ తీసుకోండి: అనేక అధ్యయనాలలో అధిక అధిక రక్తపోటు సోడియంతో ముడిపడి ఉంది. రోజువారీ దినచర్యలో తక్కువ ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యను నివారించవచ్చు. సాధారణంగా ప్రజలు ఉప్పును ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిది. సాధారణంగా ఒక మనిషి రోజు మొత్తంలో 2300 మిల్లీ గ్రాములకు మించి శరీరంలోకి ఉప్పు చేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అయితే ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో చెక్కర వ్యాధి వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు తేల్చిచెప్పారు అంతేకాదు డయాబెటిస్‌ ద్వారా బీపీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని, ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందంటున్నారు నిపుణులు.
  2.  పోటాషియం తీసుకోవడం పెంచండి: హైబీపీతో బాధపడుతున్నవారు పోటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకం. ఆహారంలో పోటాషియం ఉన్న వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ప్రాసెస్‌ చేయబడిన, ప్యాక్‌ చేయబడిన ఆహారాలలో అత్యధికంగా సోడియం ఉంటుంది. ఆహారాన్ని సమతుల్యం చేయడానికి పోటాషియం ఉన్న వాటిని తీసుకోవడం మంచిది. అవి ఆకు కూరలు, టమోటాలు, బంగాళ దుంపలు, చిలగడ పండ్లు, అరటి, అవకాడో, నారిజం, నట్స్‌, పాలు, పెరుగు వంటివి.
  3. రోజూ వ్యాయమం చేయండి: ప్రతి వ్యక్తికి వ్యాయమం ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది ఎంతో ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి 40 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
  4.  ధూమపానం మానేయండి: ధూమపానం, మద్యపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. మద్యం తాగడం వల్ల 16 శాతం అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయని పరిశోధనలలో తేలింది. ధూమపానం, మద్యపానం వల్ల రక్తనాళాలు పూర్తిగా దెబ్బ తింటాయని, ఈ రెండు మీ ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదంటున్నారు. అలాగే పిండి పదార్థాలు షుగర్‌, రక్తపోటు సమస్యను పెంచుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ రెండు విషయాలను తగ్గించడం వల్ల రక్తపోటు నుంచి కాపాడుకోవచ్చు.
  5. ఒత్తిడిని తగ్గించుకోండి: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో, మానసిక ఆందోళన, వివిధ రకాల పనులలో ఒత్తిడిలను తగ్గించుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. బీపీ ఉన్నవారు ఒత్తిడి కారణంగా మరిన్ని వ్యాధులు తెచ్చుకునే అవకాశం ఉంది. అధిక బీపీ ఉన్న వారు ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనలు, సలహాల మేరకు మీకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి