AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Hypertension Day 2022: అధిక రక్తపోటును ‘సైలెంట్ కిల్లర్’ అని ఎందుకు అంటారు? .. దేశంలో ఎంత మంది హైపర్‌టెన్షన్‌తో పోరాడుతున్నారు!

World Hypertension Day 2022: దేశంలో అధిక రక్తపోటు కేసులు పురుషులలో ఎక్కువగా నమోదవుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5 ) ఇటీవలి నివేదిక ప్రకారం...

World Hypertension Day 2022: అధిక రక్తపోటును 'సైలెంట్ కిల్లర్' అని ఎందుకు అంటారు? ..  దేశంలో ఎంత మంది హైపర్‌టెన్షన్‌తో పోరాడుతున్నారు!
Subhash Goud
|

Updated on: May 17, 2022 | 1:29 PM

Share

World Hypertension Day 2022: దేశంలో అధిక రక్తపోటు కేసులు పురుషులలో ఎక్కువగా నమోదవుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5 ) ఇటీవలి నివేదిక ప్రకారం.. దేశంలో 24 శాతం మంది పురుషులు రక్తపోటుతో బాధపడుతున్నారు. అదే సమయంలో ఈ సంఖ్య మహిళల్లో 21 శాతంగా ఉంది. షాకింగ్ విషయం ఏమిటంటే దేశంలోని 67 శాతం మంది మహిళలు, 53.7 మంది పురుషులు తమ రక్తపోటును ఎప్పుడూ పరీక్షించుకోలేద తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ప్రకారం.. 2015లో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 113 మిలియన్ల మంది ప్రజలు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 2025 నాటికి ప్రపంచ జనాభాలో 29 శాతం మంది దీని బారిన పడతారని అంచనా. మే 17వ తేదీన ప్రపంచ హైపర్‌టెన్షన్ డే. అధిక రక్తపోటు వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయి. మరి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

WHO నివేదిక ప్రకారం..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 కోట్ల మంది ప్రజలు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. 2019లో 1.79 కోట్ల మంది గుండె జబ్బులతో మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు చెబుతున్నాయి. చాలా మందికి వారి రక్తపోటు ఎంత ఎక్కువగా ఉందో అర్థం కావడం లేదు. అందుకే ఇది ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఫలితంగా గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు, ముక్కు నుంచి రక్తం కారడం, కంటి చూపు కోల్పోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి.

హెచ్చరించే హైపర్‌టెన్షన్ లక్షణాలు:

☛ మూర్ఛ అనుభూతి

☛ ఆకస్మిక అస్పష్టమైన దృష్టి

☛ వాంతులు

☛ తల, ఛాతీ నొప్పి

☛ శ్వాస ఆడకపోవుట

☛ కళ్ళలో ఎర్రటి మచ్చ

రక్తపోటు సమస్య ఎందుకు వస్తుంది?

హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. అధిక రక్తపోటు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయసు పెరగడం, ఊబకాయం, ఆల్కహాల్ తీసుకోవడం, శరీరం చురుకుగా ఉండకపోవడం, మధుమేహం, శరీరంలో సోడియం స్థాయి పెరగడం వంటివి. ఇది కాకుండా కుటుంబంలోని ఎవరికైనా అధిక రక్తపోటు సమస్య ఉంటే అది కొత్త వారి తరంలో ఉన్నవారికి వ్యాపించవచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు అధిక రక్తపోటు కోసం తనిఖీ చేయండి. పరీక్షలో సాధారణ స్థాయి రక్తపోటు 120/80 ఉండాలి.

రక్తపోటును ఎలా నియంత్రించాలి..?

  1. ధూమపానం నుండి దూరంగా ఉండటం: ఒక పరిశోధన ప్రకారం, ధూమపానం 20 నిమిషాల పాటు రక్తపోటును పెంచుతుంది. అందుకే దానిని మానేయడం మంచిది.
  2. బరువు తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది: రక్తపోటుకు స్థూలకాయమే ప్రధాన కారణమని మాయో క్లినిక్ నివేదిక చెబుతోంది. అందువల్ల, ఒక వ్యక్తి ఒక కిలో బరువు కోల్పోతే, అప్పుడు పెరిగిన రక్తపోటులో 1 పాయింట్ తగ్గింపు ఉంటుంది.
  3. ఆహారంలో ఉప్పును తగ్గించండి: ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది కూడా రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం. ఆహారంలో రోజూ 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు
  4. రోజువారీ 30 నిమిషాల వ్యాయామం అవసరం: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం లేదా వాకింగ్‌ చేస్తే రక్తపోటును 5 నుండి 8 పాయింట్లు తగ్గించవచ్చు.
  5. ఆహారంలో ఈ మార్పులు అవసరం: రక్తపోటును నియంత్రించడానికి ఆహారంలో నారింజ వంటి సీజనల్, సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోండి. పప్పులు, పప్పుధాన్యాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోండి. వేయించిన, కారంగా ఉండే వస్తువులను నివారించండి.