అమెరికాలో 10 లక్షలు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య.. మరిన్ని ఇంటర్నేషనల్ వార్తలు

మరింత ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకుంది. అటు షాంఘైలో లాక్‌డౌన్‌ ఎత్తివేతకు నిర్ణయించారు.  వ‌ర్క్ ఫ్రం హోంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచ‌ల‌నం నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో 10 లక్షలు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య.. మరిన్ని ఇంటర్నేషనల్ వార్తలు
Us Covid Deaths
Follow us
Janardhan Veluru

|

Updated on: May 17, 2022 | 1:56 PM

International News: గత రెండున్నరేళ్ల కాలంలో కరోనా మహమ్మారి బారినపడి అమెరికాలో మరణించిన వారి సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. అటు మరింత ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకుంది.  వ‌ర్క్ ఫ్రం హోంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచ‌ల‌నం నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి టాప్‌-9 ఇంటర్‌నేషనల్ న్యూస్ ఇప్పుడు చుద్దాం…

  1. ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను గట్టెక్కించడం కోసం.. ఎయిర్ లైన్స్‌ను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎయిర్‌లైన్స్‌ను ప్రయివేటీకరించిన తర్వాత కూడా నష్టాలను భరించాల్సి ఉంటుంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్ష ప్రవేశపెట్టిన డెవలప్‌మెంట్ బడ్జెట్ స్థానంలో రిలీఫ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రీమియర్ హామీ ఇచ్చారు.
  2. అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్‌ మృతుల సంఖ్య 10 లక్షలకు చేరింది.ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతర్యుద్ధం, రెండో ప్రపంచయుద్ధాల్లో మరణించిన అమమెరికన్ల సంఖ్యతో ఇది సమానం. కరోనా వ్యాక్సినేషన్‌కు ఇష్టపడని గ్రామీణ ప్రజల వల్లే ఇంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌ వాపోయింది.
  3. కరోనా వైరస్‌ విజృంభణతో చైనా ఆర్థిక నగరం షాంఘై వణికిపోయింది. వైరస్‌ కట్టడికి కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల ఆహారం, నిత్యావసరాల కొరతతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు.దీంతో నేటి నుంచి పలు జిల్లాల్లో ఆంక్షలను సడలించిన అధికారులు.. జూన్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు.
  4. ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది..కరోనా కల్లోలం సృష్టిస్తోంది. 4 రోజుల వ్యవధిలో 10 లక్షల కేసులు వచ్చినట్లు చెబుతున్నారు. నార్త్ కొరియాలో కరోనా సంక్షోభంపై కింగ్ కిమ్ జోంగ్ ఉన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కిమ్ మాస్క్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఎక్కడికక్కడ చెకింగ్ లు కొనసాగుతున్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. నార్త్ కొరియాలో కరోనా కేసుల ఉధృతి మరింతగా ఉండే ఛాన్స్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. కొరియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదని, దీంతో కరోనా కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉందని WHO రీజినల్ డైరెక్టర్ పూనమ్ సింగ్ చెప్పారు. కరోనా నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
  7. గ్రీన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి అప్లికేష‌న్ల‌ను ఆరు నెల‌ల్లోగా క్లియ‌ర్ చేయాల‌ని అమెరికా అధ్యక్ష స‌ల‌హా మండ‌లి ఏక‌గ్రీవంగా తీర్మానించింది. ఈ నేప‌థ్యంలో అధ్యక్షుడు బైడెన్‌కు త‌మ ప్రతిపాద‌న‌ల‌ను పంపింది.ఒక‌వేళ బైడెన్ అంగీకారం తెలిపితే వేలాది మంది భార‌తీయుల‌కు గ్రీన్ కార్డు ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయి.
  8. ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా ఎలిజబెత్‌ బోర్న్‌ నియమితులయ్యారు. దేశప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు.1991 నుంచి 92లో ఎడిత్‌ క్రేసన్‌ ఫ్రాన్స్‌ తొలి మహిళా ప్రధానిగా పని చేశారు. బోర్న్‌గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. త్వరలో అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి బోర్న్‌ నూతన మంత్రివర్గాన్ని నియమిస్తారు.
  9. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల వ‌ర్క్ ఫ్రం హోం సంస్కృతి అమ‌ల్లోకి వ‌చ్చింది.అయితే వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల మ‌నం చేస్తున్న ప‌నేమిటో మ‌రిచిపోతామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు బ్రిట‌న్ ప్రధాని బోరిస్ జాన్సన్..త‌న మాట‌లు ఇత‌రుల‌కు న‌చ్చక‌పోవ‌చ్చని కూడా చెప్పారు.అందరూ ఆఫీసుల‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు.
  10. పాక్‌‌‌‌లో తరుచూ దాడులు జరుగుతుండడంతో అక్కడున్న చైనా టీచర్లు సొంత దేశానికి వెళ్లిపోతున్నారు.పలు యూనివర్సిటీల్లో మాండరిన్‌‌‌‌ను బోధిస్తున్న చైనా టీచర్లే లక్ష్యంగా బాంబు దాడులు జరుగుతున్నాయి.దీంతో చైనా టీచర్లందరూ వెనక్కి రావాలంటూ చైనా పిలుపునిచ్చింది.చాలామంది వెళ్లిపోయారని కరాచీ యూనివర్సిటీ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు ఇక్కడ చదవండి..