Tax Evasion: అక్రమ సంపాదన దాచుకునే వారికి ఆ దేశం అత్యంత అనుకూలం.. తాజా నివేదికల్లో సంచలన విషయాలు..

Tax Evasion: చాలా మంది తమ సంపాదనను టాక్స్ కట్టకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. ఇందుకోసం కొన్ని దేశాలు, ద్వీపాలు స్వర్గధామంగా పేరుగాంచిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ..

Tax Evasion: అక్రమ సంపాదన దాచుకునే వారికి ఆ దేశం అత్యంత అనుకూలం.. తాజా నివేదికల్లో సంచలన విషయాలు..
Tax Heaven
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 17, 2022 | 11:12 AM

Tax Evasion: చాలా మంది తమ సంపాదనను టాక్స్ కట్టకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. ఇందుకోసం కొన్ని దేశాలు, కొన్ని ద్వీపాలు స్వర్గధామంగా పేరుగాంచిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ.. అందరి ఊహలకు అందని నిజం ఏమిటంటే సంపదను దాచుకోవాలని చూసే వ్యక్తులకు అమెరికాకంటే మరో అత్యుత్తమమైన ప్రదేశం మరేదీ లేదని తాజా వార్తలు చెబుతున్నాయి. టాక్స్ జస్టిస్ నెట్‌వర్క్(Tax Justice Network) అనే సంస్థ చేసిన పరిశోధనలో దీనికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తుల వివరాలను దాచిపెట్టడంలో న్యాయ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు ఎంత మేరకు సహాయపడుతున్నాయనే విషయాంపై ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చింది. అమెరికాలో ఆర్థిక గోప్యతను దాదాపు మూడు వంతులు పెంచిందని ఈ రిపోర్ట్ చెబుతోంది. 2009 నుంచి ర్యాంకులు ఇవ్వటం ప్రారంభమైననాటి నుంచి ఇంత దారుణమైన రేటింగ్ రావటం ఇదే తొలిసారి అని తెలిపింది.

ఈ ర్యాంకులు ఆర్థిక వ్యవస్థను అవినీతిపరులు ఎలా వినియోగించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుపుతుందని ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ & కార్పొరేట్ పారదర్శకత కూటమిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇయాన్ గ్యారీ అన్నారు. ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు దేశాల మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడికి అమెరికా మరింత మద్దతు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల పన్ను అధికారులతో సమాచారాన్ని పంచుకునేందుకు నిరాకరించడం వల్లే US అధ్వాన్నమైన స్కోర్‌కు కారణమని టాక్స్ జస్టిస్ సంస్థ పేర్కొంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఉపయోగించే పద్ధతికి అమెరికా తన విధానాన్ని మార్చుకుంటే, ప్రపంచానికి దాని ఫైనాన్సియల్ సీక్రసీ సప్లై 40% తగ్గుతుందని నివేదిక పేర్కొంది. అక్రమ లాభాలను దాచిపెట్టడానికి, లాండర్ చేయడానికి US అత్యుత్తమ ప్రదేశమని ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ డిసెంబర్ లో అన్నారు. ఇదే సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ను పరిష్కరించడానికి పారదర్శకత సంస్కరణలను తన విదేశాంగ విధానంలో కీలక స్తంభంగా మార్చుతానని గతంలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కొత్త పారదర్శకత చట్టాలను సరిగా అమలు చేయని కారణంగా జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో సమస్య కొనసాగుతూనే ఉంది. దశాబ్దాలుగా, ధనిక G-7 దేశాల బిలియనీర్లు, ఒలిగార్చ్‌లు, కార్పొరేట్ దిగ్గజాలకు గోప్యత లొసుగులు దుర్వినియోగానికి మూలంగా నిలుస్తున్నాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, జెర్సీ వంటి విదేశీ భూభాగాలు, క్రౌన్ డిపెండెన్సీలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకుంటే UKకి మరింత హానికరంగా మారాయి. తాజా లెక్కల ప్రకారం 10 ట్రిలియన్ డాలర్ల సంపద ఇలా ఆఫ్‌షోర్‌ దేశాల్లో దాచి ఉంటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చలామణీలో ఉన్న మెుత్తం డాలర్లు, యూరో బిల్లుల విలువ కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ర్యాంకులో మెుదటి స్థానంలో అమెరికా ఉండగా రెండవ స్థానంలో స్విట్జర్లాండ్ నిలిచింది. ఇంతకు ముందు అక్రమ సంపాదనకు స్వర్గధామాలుగా ఉన్న కేమాన్ దీవుల్లో ఇప్పుుడు పెట్టుబడులు భారీగా తగ్గాయి.