RBI Rules: FD రూల్స్ మారాయి.. తెలుసుకోకపోతే మీకే నష్టం.. RBI నిబంధనలు ఇవే..
Fixed Deposit: డబ్బులు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారు మన దేశంలో చాలా మందే ఉంటారు. సేవింగ్ ఖాతాలో(Savings Account) డబ్బు పొదుపు చేయటం కంటే ఎఫ్‌డీ డిపాజిట్ల వల్ల ఎక్కువ వడ్డీ ఆదాయం(Interest Income) లభిస్తుంది. కానీ ఇప్పుడు..
RBI Rules: డబ్బులు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారు మన దేశంలో చాలా మందే ఉంటారు. సేవింగ్ ఖాతాలో(Savings Account) డబ్బు పొదుపు చేయటం కంటే ఎఫ్‌డీ డిపాజిట్ల వల్ల ఎక్కువ వడ్డీ ఆదాయం(Interest Income) లభిస్తుంది. దీనికి తోడు ఈ పెట్టుబడులు చాలా సురక్షితమైనవి. అందుకే చాలా మంది రిటైర్ అయిన వారు, పెన్షనర్లు, గ్రామాల్లో నివసించేవారు.. ఇలా అనేక మంది తమ జీవితకాల కష్టార్జితాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటుంటారు. కానీ.. ఇప్పుడు రిజర్వు బ్యాంక్ తెచ్చిన తాజా నిబంధనలు వారిపై భారీగా ప్రభావాన్ని చూపనున్నాయి. ఒక పక్క బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఈ తరుణంలో అధిక ఆదాయం రావాల్సింది పోగా.. దాచుకున్న డబ్బుకు తక్కువ వడ్డీ వచ్చే ప్రమాదం ఉంది. అసలు రిజర్వు బ్యాంక్ తెచ్చిన కొత్త రూల్స్ ఏమిటి. ఇంతకు ముందు ఉన్న నిబంధనలకు ఇప్పటి వాటికీ మధ్య తేజా ఏమిటి. వీటిని పాటించకపోతే ఎలా నష్టం కలుగుతుంది. ఇలాంటి విషయాలు పెట్టుబడికి ముందే తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది. ఒక్కసారి డబ్బు దాచుకునే వారు గుర్తుంచుకోవలసిన కీలక విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇంత నష్టమా..
ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బు దాచుకునేవారు.. మెచ్యూరిటీ సమయంలో దానిని విత్ డ్రా చేయకపోయినా లేదా క్లెయిమ్ పెట్టుకోకపోయినా.. గడువు తీరిన తరువాత మీకు బ్యాంకులు తక్కువ వడ్డీని చెల్లిస్తాయి. మీరు డిపాజిట్ చేసిన సమయంలో హామీ ప్రకారం వడ్డీని చెల్లించవు. పైగా ఆ మెుత్తానికి మెచ్యూరిటీ తరువాత సేవింగ్స్ అకౌంట్లకు చెల్లించే వడ్డీ రేటును అందిస్తాయి. దీని వల్ల ఇన్వెస్ట్ చేసినవారికి తక్కువ మెుత్తంలో వడ్డీ ఆదాయం లభిస్తుంది.
ఉదాహరణకు చాలా బ్యాంకులు 5 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధి ఉండే ఎఫ్‌డీలకు 5 శాతానికి పైగా వడ్డీని అందిస్తున్నాయి. అదే విధంగా సేవింగ్స్ ఖాతాలపై 3 నుంచి 4 శాతం మధ్యలో వడ్డీని చెల్లిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం సేవింగ్స్ అకౌంట్లపై కూడా మంచి వడ్డీని చెల్లిస్తున్నాయి. ఒక వేళ మీరు సకాలంలో మీ డబ్బును విత్ డ్రా చేసుకోకపోతే మీకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం సగానికి పైగా పడిపోతుంది. దీని వల్ల వినియోగదారులకు భారీగా నష్టం కలుగుతుంది. తాజా రూల్స్.. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, లోకల్ రీజనల్ బ్యాంకులలో డిపాజిట్ చేసిన ఎఫ్‌డీలకు వరిస్తాయి. పాత పద్ధతిలో ఒక వేళ మీరు మెచ్యూరిటీ సమయంలో డబ్బు విత్ డ్రా చేసుకోకపోతే.. బ్యాంకులు అంతకు ముందు వినియోగదారుడు డిపాజిట్ చేసిన కాలానికే ఆ మెుత్తాన్ని తిరిగి ఎఫ్‌డీ రెన్యూవల్ చేసేవి. అందువల్ల వినియోగదారులు మరిచిపోయినా వారికి మాత్రం వడ్డీ ఆదాయం వస్తూనే ఉండేది. కానీ మారిన రూల్స్ ప్రకారం ఇలా కుదరదు.