AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unlimited Vacation: ఉద్యోగం చేస్తే గీస్తే అలాంటి కంపెనీలోనే చేయాలబ్బా.. ఆ కంపెనీ బంపర్ ఆఫర్ ఏంటంటే..!

Unlimited Vacation: ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో కరోనా తరువాత చాలా మార్పులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కరోనా తరువాత ఉద్యోగులు తమ సంస్థలను వీడకుండా చూసుకునేందుకు అనేక కంపెనీలు వినూత్నమైన ఆఫర్లు అందిస్తున్నాయి.

Unlimited Vacation: ఉద్యోగం చేస్తే గీస్తే అలాంటి కంపెనీలోనే చేయాలబ్బా.. ఆ కంపెనీ బంపర్ ఆఫర్ ఏంటంటే..!
Leaves
Ayyappa Mamidi
|

Updated on: May 16, 2022 | 5:11 PM

Share

Unlimited Vacation: ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో కరోనా తరువాత చాలా మార్పులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కరోనా తరువాత ఉద్యోగులు తమ సంస్థలను వీడకుండా చూసుకునేందుకు అనేక కంపెనీలు వినూత్నమైన ఆఫర్లు అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు శాలరీలు పెంచుతుంటే, మరికొన్ని పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, మరి కొన్ని కంపెనీలు సెలవుల విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నాయి. తాజాగా.. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన  Goldman Sachs Group Inc తమ సీనియర్ సిబ్బందిని అపరిమిత సంఖ్యలో సెలవులు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకునేందుకు ఇలాంటి ఆలోచనతో కంపెనీ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో కూడా అవసరానికి సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

జూనియర్ ఉద్యోగుల సెలవుల విషయంలో ఇప్పటికీ పరిమితులు ఉన్నాయి. అయితే నెల ప్రారంభంలో తచ్చిన కొత్త విధానం ప్రకారం ప్రతి సంవత్సరం కనీసం రెండు రోజులు అదనంగా సెలవులు రానున్నాయి. గోల్డ్‌మన్ ఉద్యోగులందరూ 2023 నుంచి ప్రతి సంవత్సరం మూడు వారాల సెలవు తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ఒక మెమోలో పేర్కొంది. అందులో కనీసం ఒక వారం వరుస సెలవులు తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. జూనియర్ ఉద్యోగులు పని సమయం, ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ఫిర్యాదు చేసిన సంవత్సరం లోపై ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ఉద్యోగుల్లో కొత్త జోష్ నింపుతోంది. పనిని మెరుగుపరిచేందుకు రానున్న కాలంలో మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

వాల్ స్ట్రీట్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు అమలు చేసిన పని విధానాల్లో మార్పులు తెచ్చి ఉద్యోగుల పని, లైఫ్ బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉద్యోగులను నిలుపుకోవటం, కొత్త ప్రతిభను ఆకర్షించటం కోసం పోటీ తీవ్రమైంది. గోల్డ్‌మ్యాన్ గత నెలలో కార్యాలయంలో ఉచిత అల్పాహారం, భోజన సదుపాయలను ఉద్యోగులకు కల్పించింది. ఇలా ఉద్యోగులను తిరిగి ఆఫీస్ బాట పట్టించేందుకు కంపెనీ అందరికంటే ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి..

Market Closing Bell: వరుస నష్టాలకు బ్రేక్.. మార్కెట్లకు దన్నుగా నిలిచిన ఆటో సెక్టార్ షేర్లు..

Bank Fraud: బ్యాంక్ ఫ్రాడ్ల విషయంలో ఆ నిబంధనలు మార్చాలంటున్న దిగ్గజ బ్యాంకర్లు.. ఎందుకంటే..