Market Closing Bell: వరుస నష్టాలకు బ్రేక్.. మార్కెట్లకు దన్నుగా నిలిచిన ఆటో సెక్టార్ షేర్లు..

Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి మెల్లగా బయటపడుతున్నాయి. వారం ప్రారంభమలో స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోనే ముగిశాయి.

Market Closing Bell: వరుస నష్టాలకు బ్రేక్.. మార్కెట్లకు దన్నుగా నిలిచిన ఆటో సెక్టార్ షేర్లు..
Market opening
Follow us

|

Updated on: May 16, 2022 | 4:31 PM

Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి మెల్లగా బయటపడుతున్నాయి. వారం ప్రారంభమలో స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోనే ముగిశాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 180 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 60 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 476 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 340 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆరంభంలో కొంత మేర స్తబ్దుగా కొనసాగాయి. ఆ సమయంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఆ తరువాత అమ్మకాల ఊతంతో సూచీలు లాభాలబాట పట్టాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ దాదాపు 3 శాతం పెరిగగా.. నిఫ్టీ రియల్టీ 2.5 శాతం, నిఫ్టీ ఆటో 2 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్, మెటల్ ఒక్కొక్కటి ముగింపులో 0.5 మరియు 1.5 శాతం మధ్య పెరిగాయి.

ఐచర్ మోటార్స్ 7.62%, ఇండస్ టవర్స్ 4.16%, ఎన్టీపీసీ 2.84%, యూపీఎల్ 2.65%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.33%, మారుతీ సుజుకీ 2.05%, బజాజ్ ఆటో 2.02%, యస్ బ్యాంక్ 2.01%, గెయిల్ ఇండియా 1.96%, హీరో మోటొకార్ప్ 1.91% మేర లాభపడి మార్కెట్ ముగింపులో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. అల్ట్రాటెక్ సిమెంట్ 2.97%, ఏషియా పెయింట్స్ 2.09%, వేదాంతా 1.96%, ఐటీసీ 1.74%, లుపిన్ 1.62%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1.55%, హెచ్పీసీఎల్ 1.47%, టెక్ మహీంద్రా 1.15%, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1.12%, ఇన్ఫోసిస్ 1.02% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

ఇవీ చదవండి..

Bank Fraud: బ్యాంక్ ఫ్రాడ్ల విషయంలో ఆ నిబంధనలు మార్చాలంటున్న దిగ్గజ బ్యాంకర్లు.. ఎందుకంటే..

Adani: పంతం నెగ్గించుకున్న గౌతమ్ అదానీ.. భారీ డీల్ కు ఆ కంపెనీల కొనుగోలు.. పూర్తి వివరాలు..