Bank Fraud: బ్యాంక్ ఫ్రాడ్ల విషయంలో ఆ నిబంధనలు మార్చాలంటున్న దిగ్గజ బ్యాంకర్లు.. ఎందుకంటే..

Bank Fraud: 'ఫ్రాడ్' నిర్వచనాన్ని మార్చాలని, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను(RBI) దేశంలోని అగ్రగామి బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం..

Bank Fraud: బ్యాంక్ ఫ్రాడ్ల విషయంలో ఆ నిబంధనలు మార్చాలంటున్న దిగ్గజ బ్యాంకర్లు.. ఎందుకంటే..
Fraud
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 16, 2022 | 3:55 PM

Bank Fraud: ‘ఫ్రాడ్’ నిర్వచనాన్ని మార్చాలని, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను(RBI) దేశంలోని అగ్రగామి బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా ఒక కంపెనీ తన అప్పులను ఏదైనా బ్యాంకుకు చెల్లించకపోతే.. సదరు కంపెనీకి ఇతర బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను సైతం ఫ్రాడ్ ఖాతాలుగా(Fraud Account) గుర్తించాల్సి ఉంటుంది. దీని కారణంగా బ్యాంకులు సదరు కంపెనీ బ్యాంక్ ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేయటం, తక్కువ మెుత్తానికి కూడా ఎక్కువ చర్యలు చేపట్టవలసి వస్తోంది. దీనివల్ల బ్యాంకులు ఎక్కువగా బాధపడుతున్నాయి. కొన్ని వారాల క్రితం బ్యాంకులు దీనిపై సెంట్రల్ బ్యాంక్ తో చర్చించాయి.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో సునీల్ మెహతా మాట్లాడుతూ.. కొంత మెుత్తంలో నిధులను మళ్లించారనే కారణంగా మొత్తం కంపెనీ రుణాలను ఫ్రాడ్ గా ప్రకటించటం సరికాదు. దీనికి తోడు డిక్లరేషన్, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయటం వల్ల కంపెనీపై మరింత ప్రతికూల ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఒక మాజీ బ్యాంక్ అధికారి తెలిపారు. ఏదైనా కంపెనీలో మోసం జరిగినప్పుడు దానిని సదరు విలువకు మాత్రమే పరిమితం చేయటం లేదా వ్యాల్యూ ఎట్ రిస్క్ మాత్రమే పరిమితం చేయటం సరైనదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ కారణంగా డీఫాల్ట్ అవ్వని బ్యాంకులు కూడా గ్రేడ్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ పద్ధతిలో మార్పులు తీసుకొచ్చే దిశగా రిజర్వు బ్యాంక్ కొత్త నిబంధనలను తీసుకురావాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం ఏదైనా లోన్ మెుత్తాన్ని 90 రోజుల పాటు చెల్లించకపోతే దానిని ఎన్పీఏ గా వర్గీకరిస్తారు. ఆ తరువాత ఫారెన్సిక్ ఆడిట్ లో కనుగొన్న వివరాల ప్రకారం సదరు బ్యాంక్ ఖాతాను ఫ్రాడ్ గా వర్గీకరిస్తారు.

ఇవీ చదవండి:

Bharat Biotech: రాములోరికి భారత్ బయోటెక్ భారీ విరాళం.. నేరుగా భద్రాద్రి ఆలయ ఖాతాలో జమ..

North Korea: కరోనా కేసులే లేవన్న కిమ్‌ కింగ్‌డమ్‌లో లక్షకు పైగా పాజిటివ్స్‌..పరిస్థితి చెప్పలేమంటున్న నిపుణులు