AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Korea: కరోనా కేసులే లేవన్న కిమ్‌ కింగ్‌డమ్‌లో లక్షకు పైగా పాజిటివ్స్‌..పరిస్థితి చెప్పలేమంటున్న నిపుణులు

కిమ్‌ కింగ్డమ్‌లో కరోనా కలకలం సృష్టి్స్తోంది. ఉత్తర కొరియాలో కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో కోవిడ్‌ కేసులు లేవని ఉత్తరకొరియా చెబుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

North Korea: కరోనా కేసులే లేవన్న కిమ్‌ కింగ్‌డమ్‌లో లక్షకు పైగా పాజిటివ్స్‌..పరిస్థితి చెప్పలేమంటున్న నిపుణులు
Kim Jong Un
Follow us
Jyothi Gadda

|

Updated on: May 16, 2022 | 1:37 PM

కిమ్‌ కింగ్డమ్‌లో కరోనా కలకలం సృష్టి్స్తోంది. ఉత్తర కొరియాలో కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో కోవిడ్‌ కేసులు లేవని ఉత్తరకొరియా చెబుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సింగిల్ డే కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర కొరియాలో కరోనా కేసు నమోదైనట్టు మే 12న అధికారిక ప్రకటన వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఒమిక్రాన్‌ మొదటి కేసు నమోదు కాగా, తాజాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఆందోళనలో పడ్డారు. వైద్యా ఆరోగ్య శాఖతో అత్యవవసర భేటీ నిర్వహించారు. కాగా, ఆ దేశం కరోనా కేసులను అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కిమ్ జోంగ్-ఉన్ ఉవ్వెత్తున లేచారు. వైరస్‌ వ్యాప్తికి వైద్యశాఖ నిర్లక్ష్యంగా మండిపడ్డారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా విజృంభిస్తున్నందున, మందులు పంపిణీ చేయడంలో సహాయం చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. ప్యోంగ్యాంగ్ నగరంలో మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్రమైన జ్వరంతో అనారోగ్యం బారినపడినట్టు రాష్ట్ర మీడియా తెలిపింది. తమ దేశంలో వైరస్‌ వ్యాప్తి అత్యంత వేగంగా ఉందని తెలిపింది. మూడు రోజుల్లోనే 8.20 లక్షల కేసులు నమోదైనట్టు అధికారిక మీడియా వెల్లడించింది. ఇందులో 3.24 లక్షల మంది చికిత్స పొందుతున్నట్టు వివరించింది. ఈ మూడు రోజుల్లో దాదాపు 50 మంది మరణించినట్టుగా ప్రకటించింది. ఇప్పుడు ఉత్తర కొరియా కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు బయటపడడంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణకు నడుం బిగించింది. తమ దేశానికి దాపురించిన మహా విపత్తు అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొన్నారు. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి విపత్తు రాలేదని అన్నారు.

మరో పక్క, నార్త్‌ కొరియాలో కోవిడ్ పెను విపత్తును సృష్టించే అవకాశాలు ఉన్నాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియాకు కోవిడ్‌ను ఎదుర్కొవడానికి సరైన ఆయుధాలు లేవు. ఇదే ఆ దేశం ముందున్న అతి పెద్ద సవాలుగా మారింది. ఆ దేశ ప్రజలు వ్యాక్సీన్లు తీసుకోలేదు. దేశంలో కేసులు అతి తక్కువ ఉన్నాయని భావిస్తున్నారు కాబట్టి ఎక్కువమంది ప్రజలు వైరస్‌కు ఎక్స్‌పోజ్ కాలేదని భావించవచ్చు. అలాంటప్పుడు వారికి కోవిడ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఆస్పత్రిలో చేరే రోగుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా ఉండవచ్చు. టెస్టింగ్ కూడా తక్కువగానే జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నార్త్ కొరియా 64,000 టెస్టులు జరిపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

“ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి అనేది స్థాపించబడినప్పటి నుండి మన దేశంపై పడిన గందరగోళం” అని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఆయనను ఉటంకిస్తూ పేర్కొంది. మరోవైపు, ప్రత్యక్ష ఆరోగ్య ప్రభావంతో పాటు, ఉత్తర కొరియాలో ఆహార ఉత్పత్తిపై భయాలు పెరిగాయి. ఎందుకంటే, ఇది 1990లలో క్రూరమైన కరువును ఎదుర్కొంది, నేడు ప్రపంచ ఆహార కార్యక్రమం దేశంలోని 25 మిలియన్ల మందిలో 11 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అంచనా వేసింది. పాతబడిన వ్యవసాయ పద్ధతులతో, దేశానికి సరిపడనంత పంట పండించలేక చతికిలబడింది. ఇక వ్యవసాయదారులు పొలాలకు వెళ్లి పనిచేయలేకపోయే సమస్య మరింత తీవ్రం అవుతుంది.వ్యవసాయ రైతులు, కూలీలు సేద్యానికి దూరమైతే..పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అదే దక్షిణ కొరియాలో టెస్టింగ్, ట్రేసింగ్ ప్రధాన వ్యూహంగా కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ దేశంలో సుమారు 17.21 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో గణాంకాలు, లెక్కలు ప్రభుత్వాలకు ప్రధాన సాధనాలుగా పనికొచ్చాయి. నార్త్ కొరియాలో అవీ సరిగా లేవు. అత్యధిక తీవ్రతతో ఎమర్జెన్సీ క్వారంటైన్ సిస్టమ్ అమల్లో ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నారు. అసలే ఆ దేశపు వ్యవహారాలన్నీ రహస్యంగా ఉంటాయి. లోపలి నుంచి వివరాలు బయటకు రానివ్వరు. ఇలాంటి టైమ్‌లో ప్రస్తుతం నార్త్ కొరియాలో కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమేనంటున్నారు నిపుణులు.

Viral video : విష సర్పంతో చిన్నదాని ఆటలు..కసితో రగిలిపోయిన స్నేక్‌ ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..