Viral video : విష సర్పంతో చిన్నదాని ఆటలు..కసితో రగిలిపోయిన స్నేక్‌ ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రపంచంలోని అనేక వింతలు క్షణాల్లోనే అరచేతిలోకి చేరిపోతున్నాయి. సోషల్‌ మీడియా వేదికపై నిత్యం కొన్ని వందల వేల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.

Viral video : విష సర్పంతో చిన్నదాని ఆటలు..కసితో రగిలిపోయిన స్నేక్‌ ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..
Playing Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: May 16, 2022 | 12:31 PM

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రపంచంలోని అనేక వింతలు క్షణాల్లోనే అరచేతిలోకి చేరిపోతున్నాయి. సోషల్‌ మీడియా వేదికపై నిత్యం కొన్ని వందల వేల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. జంతువులు, పక్షులు, పాములు, పసిపిల్లలకు సంబంధించిన కూడా చాలా రకాల వీడియోలు ఉంటాయి. నెటిజన్లు సైతం వైరల్‌ వీడియోలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పదేపదే అలాంటి వీడియోలను చూస్తూ టైమ్‌ చేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. లైక్ చేస్తారు. కామెంట్ చేస్తారు.అయితే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి కొంతమంది ప్రమాదకర స్టంట్స్‌ చేస్తుంటారు. ఆ వీడియోలను ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఓ యువతి పాముతో ఓ వీడియో చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఓ యువతి ఓ భారీ విషసర్పాన్ని పట్టుకుని ఉంది. ఆమె ఏ మాత్రం భయంలేకుండా ఆ పాముతో ఆడటానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ప్రాణభయంతో ఆ పాము మాత్రం యువతి చేతుల్లోంచి తప్పించుకోవాలని చూస్తుంటుంది. అయినా ఆమె ఆ పాముని వదలకుండా ఆడిస్తూనే ఉంటుంది.. దీంతో చిర్రేత్తిపోయిన పాము..ఆమె మణికట్టుపై కాటువేస్తుంది. అయినా ఆ యువతి దానిని విడిచిపెట్టదు. మరీ కోపంతో రగిలిపోయిన పాము ఏకంగా ఆ యువతి చేతిని కొరుకుతుంది. ఇంతచేసినా ఆ యువతి మాత్రం పాముని విడిచిపెట్టలేదు. అలాగే పట్టుకొని ఆడుతుంటుంది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. యువతి చేసిన పనికి వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అదేంటి పాము కాటువేసినా యువతికి ఏమీ కాలేదే అంటూ మరికొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్‌ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు మీ కామెంట్‌ చెప్పేయండి..