AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేపాల్-భారత్ మధ్య బౌద్ద బంధం.. లుంబినీని సందర్శించిన తొలి ప్రధానిగా మోడీ రికార్డు..

PM Modi Nepal Visit: PM మోడీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా కలిసి మాయా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అశోక స్తంభంపై దీపం వెలిగించారు. అదే సమయంలో..

PM Modi: నేపాల్-భారత్ మధ్య బౌద్ద బంధం.. లుంబినీని సందర్శించిన తొలి ప్రధానిగా మోడీ రికార్డు..
Pm Modi Nepal Visit
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: May 16, 2022 | 7:02 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల పర్యటన కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య బౌద్ధ వారసత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని పర్యటన సహాయ పడుతోంది. ఈ సందర్భంగా PM మోడీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా కలిసి మాయా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అశోక స్తంభంపై దీపం వెలిగించారు. అదే సమయంలో ఇద్దరి సమక్షంలో లుంబినీలోని బౌద్ధ విశ్వవిద్యాలయంలో భారతీయ ప్రొఫెసర్ నియామకంతో పాటు అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరుగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్‌లోని లుంబినీలో దాదాపు 5 గంటలపాటు పర్యటించనున్నారు. మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇప్పటికే లుంబినీకి చేరుకుంది. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్‌తో బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ భగవానుడి జన్మస్థలమైన లుంబినీలో ఉన్నారు.  భారత ప్రధాని లుంబినీని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇండియా చైర్‌ను ఏర్పాటు చేస్తారు

లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హృదయరత్న వజ్రాచార్య మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం విశ్వవిద్యాలయంలో ఇండియా చైర్ ఏర్పాటు చేయబడుతుంది. దీని కింద బౌద్ధ విషయాలను బోధించేందుకు భారతీయ ప్రొఫెసర్‌ను నియమిస్తారు. ప్రస్తుతం ఐదేళ్లపాటు చెల్లుబాటయ్యే ఈ ఏర్పాటు.. లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఆరు నెలల పాటు సెమిస్టర్‌ను బోధించడానికి ప్రతి సంవత్సరం ఒక భారతీయ ప్రొఫెసర్‌ని నియమించాల్సి ఉంటుంది.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం మధ్య ‘ఇండియా చైర్’ స్థాపన కోసం ఎంఒయు కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి దేవుబా, భారత ప్రధాని మోదీ సమక్షంలో భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు.. లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం అధికారులు ఎంఓయూపై సంతకాలు చేస్తారు. దేశాల మధ్య విశ్వవిద్యాలయాలలో పరిశోధన, అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ఒప్పదం చేసుకోనున్నాయి. నేపాల్ ఒక దశాబ్దం క్రితం భారతదేశంలోని కాశీలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ‘నేపాల్ చైర్’ని  ఏర్పాటు చేసింది.

ప్రధాని మోదీకి గౌరవ డాక్టరేట్..

అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా బిజీ షెడ్యూల్ కారణంగా లుంబినీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. బౌద్ధ అధ్యయనాల విస్తరణకు ఆయన చేసిన కృషికి విశ్వవిద్యాలయం ప్రధాని మోడీకి ఈ డిగ్రీని ఇవ్వాలని యోచిస్తోంది.

అంతర్జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి: AP: నీళ్లలో ఏవో తేలుకుంటూ వచ్చాయ్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు..

Telangana: బెట్టింగ్ వేసి ఉద్దరించినవాళ్లు ఎవరూ లేరు.. ఇతనిలా బలైపోయినవాళ్లు తప్ప