AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పెషావర్ లో సిక్కులపై దుండగుల కాల్పులు.. ఇద్దరు మృతి.. వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు

పాకిస్తాన్(Pakistan) లో సిక్కు మైనారిటీలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పాకిస్తాన్ లోని పెషావర్‌(Peshawar)కు సమీపంలో ఇద్దరు సిక్కు పౌరులను దుండగులు....

Pakistan: పెషావర్ లో సిక్కులపై దుండగుల కాల్పులు.. ఇద్దరు మృతి.. వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు
Gun Firing
Ganesh Mudavath
|

Updated on: May 16, 2022 | 11:25 AM

Share

పాకిస్తాన్(Pakistan) లో సిక్కు మైనారిటీలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పాకిస్తాన్ లోని పెషావర్‌(Peshawar)కు సమీపంలో ఇద్దరు సిక్కు పౌరులను దుండగులు కాల్చి చంపారు. సర్బాంద్‌ పట్టణంలో దుకాణం నిర్వహిస్తోన్న సల్జీత్‌ సింగ్‌, రంజీత్‌ సింగ్‌ లపై దుండగులు జరిపిన కాల్పుల్లో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన అనంతరం దుండగులు బైక్ పై పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దాడులకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ ఉగ్రచర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరిగిన ఈ దాడిని పాక్‌ ప్రధాని హెషబాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు వారికి శిక్షపడేలా చూడాలని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమ్మూద్‌ ఖాన్‌ను ఆదేశించారు. ముస్లిమేతర పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉగ్రచర్యలను సహించేది స్పష్టం చేశారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహరాలశాఖ అంసతృప్తి వ్యక్తం చేసింది. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రభుత్వం విఫలమైందని ఆవేదన చెందారు.

సిక్కులపై జరిగిన దాడిపై పాకిస్తాన్ విదేశీ వ్వవహారాలశాఖ మంత్రి బిలావల్‌ భుట్టో స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరిగిన దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఘోరమైన, దుర్భరమైన దాడిగా పేర్కొన్న భారత్‌.. వరుసగా జరుగుతోన్న దారుణాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 2017 గణాంకాల ప్రకారం, పాకిస్థాన్‌లో మైనారిటీలుగా ఉన్న వారిలో హిందువులే ఎక్కువ. రెండో వరుసలో క్రిస్టియన్‌లు ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Hyderabad: బ్లూ ఫ్యాబ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ అనుమతులపై తేలని స్పష్టత.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..

ATF Price Hike: విమాన ప్రయాణం మరింత ప్రియం కానుందా..? పెరిగిన ఇంధన ధరలు.. వరుసగా పదో సారి పెంపు