ATF Price Hike: మరింత ప్రియం కానున్న విమాన ప్రయాణం.. పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు..

ATF Price Hike: విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌. జెట్ ఫ్యూయల్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్..

ATF Price Hike: మరింత ప్రియం కానున్న విమాన ప్రయాణం.. పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు..
Follow us

|

Updated on: May 16, 2022 | 12:39 PM

ATF Price Hike: విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌. జెట్ ఫ్యూయల్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనం (Jet Fue) ధరలను కిలోలీటర్‌కు 5 శాతం పెంచాయి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 16 మే 2022 సోమవారం జెట్ ఇంధనం ధరలను కిలోలీటర్‌కు రూ. 6,188 పెంచింది. ఏటీఎఫ్ ధరలు పెరగడం ఇది వరుసగా 10వసారి. 16 మే 2022న ఢిల్లీలో ఎయిర్ టర్బైన్ ఇంధనం ధర కిలోలీటర్‌కు రూ. 1,16,852 నుండి రూ. 1,23,039.71కి పెరిగింది. కోల్‌కతాలో రూ.127,854.60, ముంబైలో రూ.121,847.11, చెన్నైలో కిలోలీటర్‌కు రూ.127,286.13కు చేరింది.

విమాన టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం

జెట్ ఇంధన ధరల పెరుగుదల కారణంగా విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంధనం విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాది ఏటీఎఫ్ ధరలు పెరగడం ఇది 10వసారి. ఇంధన ధరలు పెరగడంతో విమాన టికెట్‌ ధర పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది జెట్ ఇంధన ధరలు 61.7 శాతం పెరిగాయి. జనవరి 1, 2022 నుండి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ATF ధర కిలోలీటర్‌కు రూ. 46,938 పెరిగింది. జనవరి 1 నుంచి జెట్ ఇంధనం కిలోలీటర్‌కు రూ.76,062 నుంచి రూ.1.23 లక్షలకు పెరిగింది. జెట్ ఇంధనం ధర నెలలో రెండుసార్లు పెరిగింది. నెలలో 1వ,16వ తేదీల్లో విమానాల ధరలు మారుతాయి.

ఇవి కూడా చదవండి

పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా దాదాపు 40 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ 6న పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలకడగా కొనసాగుతున్నాయి. మార్చి 22 నుండి ఏప్రిల్ 6 వరకు దేశంలో పెట్రోల్ ధర 10 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 6 నుంచి ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49 ఉండగా, లీటర్‌ డీజిల్ ధర రూ.105.65కు చేరుకుంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.12 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.99.83గా ఉంది.చెన్నైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా, డీజిల్ ధర రూ. 100.94 వద్ద కొనసాగుతోంది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత దేశం చమురు అవసరాలను తీర్చడానికి 85 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వరకు ఉండే జెట్ ఇంధనం.. ఈ ఏడాది కొత్త గరిష్టాలకు చేరుకుంది. 2022 ప్రారంభం నుండి ప్రతి పదిహేను రోజులకు ATF ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల ప్రభావం ప్రయాణికులపై పడుతోంది. విమాన ప్రయాణం కూడా మరింత ప్రియం అవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.