Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Petrol-Diesel Price Today: దేశంలో ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి జీవన విధానం భారంగా ..

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!
Follow us

|

Updated on: May 16, 2022 | 8:05 AM

Petrol-Diesel Price Today: దేశంలో ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి జీవన విధానం భారంగా మారింది. దేశంలో ఏప్రిల్‌ 6 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ధరలు నిలకడగా ఉండటంతో సామాన్య జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినా ప్రస్తుతం రూ.100కుపైగా ఉన్న ధరలతోనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మే 16వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

☛ దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు లీటర్‌ పెట్రోల్ ధర రూ.105.41గా ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది.

☛ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120.51 ఉండగా, డీజిల్‌ ధర రూ.104.77 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49 ఉండగా, లీటర్‌ డీజిల్ ధర రూ.105.65కు చేరుకుంది.

☛ కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 115.12, డీజిల్ ధర లీటరుకు రూ. 99.83 వద్ద ఉంది.

☛ చెన్నైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.100.94 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 115.12 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.99.83 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల కారణంగా ఏప్రిల్ నెలలో భారతదేశం ముడి చమురు దిగుమతి బిల్లు రికార్డు స్థాయికి చేరుకుంది. ఏప్రిల్‌లో భారత్‌ రోజుకు 48 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇందులో రష్యా సహకారం 5 శాతం ఉంది. నివేదికల ప్రకారం.. రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతులను పెంచింది. మే 9వ తేదీ వరకు రష్యా నుంచి 10 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అయింది. 13 మిలియన్ బ్యారెళ్ల చమురు 16 నౌకల్లో 1 వచ్చే నాలుగు వారాల్లో భారత్‌కు చేరుకోనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి