Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF Account: మీ పిల్లల పేరుపై పీపీఎఫ్‌ ఖాతా తెరవండి.. నెలకు రూ.10,000 పెట్టుబడితో రూ.32 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

PPF Account: పిల్లల జీవితం బాగుండాలని ఎన్నో కలలు కంటుంటారు తల్లిదండ్రులు. వారి చదువులు, పెళ్లిళ్ల ఖర్చుల కోసం ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఇప్పుడున్న..

PPF Account: మీ పిల్లల పేరుపై పీపీఎఫ్‌ ఖాతా తెరవండి.. నెలకు రూ.10,000 పెట్టుబడితో రూ.32 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 16, 2022 | 7:42 AM

PPF Account: పిల్లల జీవితం బాగుండాలని ఎన్నో కలలు కంటుంటారు తల్లిదండ్రులు. వారి చదువులు, పెళ్లిళ్ల ఖర్చుల కోసం ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మీ పిల్లల జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు సరైన సమయంలో పెట్టుబడి ప్రణాళికను రూపొందించవచ్చు. దీని కోసం తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో డబ్బులు అందుకునే పథకాలు కూడా ఉన్నాయి. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( PPF). ఈ స్కీమ్‌ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు సరైన సమయంలో మైనర్ పిల్లల కోసం PPF ఖాతాను తెరిచి, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. మీరు ప్రతి నెలా డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా వారు పెద్దయ్యాక పెద్ద మొత్తంలో డబ్బులు అందుకోవచ్చు.

పీపీఎఫ్‌లో చేరేందుకు వయస్సు పరిమితి లేదు. మీకు కావలసినప్పుడు మీరు ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టవచ్చు. ఇందు కోసం మీరు బ్యాంకుకు వెళ్లి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఫారమ్ పేరు ఫారం A ఉండేది కానీ. ఇప్పుడు దీనిని ఫారమ్ 1 అని పిలుస్తారు. మీరు సమీపంలో ఉన్న ఏదైనా బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని PPF ఖాతాను తెరవవచ్చు

PPF ఖాతాను ఎలా తెరవాలి

ఇవి కూడా చదవండి

ఖాతా తెరవడానికి మీరు మీ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ వివరాలను చిరునామా రుజువుగా ఇవ్వవచ్చు. మీరు మీ మైనర్ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి. ఖాతా తెరిచే సమయంలో మీరు కనీసం రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చెక్కును అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పిల్లల పేరు మీద PPF పాస్‌బుక్ జారీ చేయబడుతుంది.

రూ.32 లక్షలు పొందడం ఎలా..?

పిల్లల పేరు మీద ఉన్న పీపీఎఫ్ ఖాతా నుంచి రూ.32 లక్షలు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ మైనర్ పిల్లల వయస్సు 3 సంవత్సరాల సమయంలో మీరు PPF ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. పిల్లలకి 18 ఏళ్లు వచ్చేసరికి పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అవుతుంది. అంటే మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మీరు పిల్లల PPF ఖాతాలో ప్రతి నెలా రూ. 10,000 జమ చేయడం ప్రారంభించాలి. మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 చేసిన డిపాజిట్‌ మొత్తానికి 7.10 శాతం వడ్డీ వస్తుంది. PPF ఖాతా మెచ్యూరిటీపై పిల్లలకు రూ. 3,216,241 లభిస్తుంది. పిల్లల వయస్సు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని అందుకోవచ్చు. ఈ డబ్బులు మీ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర ఖర్చులకు ఉపయోగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source: