New Tax Slab: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కొత్త – పాత పన్ను విధానం ఏమిటి? ట్యాక్స్‌ మినహాయింపు ఎవరికి?

New Tax Slab: 2020 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్న్ ( ITR ) ఫైల్ చేయడాన్ని సులభతరం ..

New Tax Slab: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కొత్త - పాత పన్ను విధానం ఏమిటి? ట్యాక్స్‌ మినహాయింపు ఎవరికి?
Follow us

|

Updated on: May 16, 2022 | 10:55 AM

New Tax Slab: 2020 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్న్ ( ITR ) ఫైల్ చేయడాన్ని సులభతరం చేయడానికి ఈ కొత్త వ్యవస్థ (New Tax Slab) ప్రారంభించబడింది. అయితే కొత్త పన్ను స్లాబ్‌ను ప్రవేశపెట్టడంతో, పాత పన్ను విధానం లేదా పాత పన్ను స్లాబ్‌ను కూడా కొనసాగించనున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ సౌలభ్యం ప్రకారం కొత్త, పాత పన్ను స్లాబ్‌లను ఎంచుకోవచ్చు. అలాగే తదనుగుణంగా ITR ఫైల్ చేయవచ్చు. కొత్తదైనా పాతదైనా, ఏ పన్ను స్లాబ్‌లో ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి అనే ప్రశ్న కూడా మీకు రావచ్చు. పాత పన్ను విధానం ఆదాయపు పన్ను రేటు మీ ఆదాయ స్లాబ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో వయసును బట్టి ఉంటుంది. మీ వయస్సు 60 ఏళ్లలోపు ఉంటే, పాత పన్ను స్లాబ్‌లో 2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. అదే రూ. 2.5 నుండి 5 లక్షల ఆదాయానికి 5% పన్ను వర్తిస్తుంది. సెక్షన్ 87A కింద మినహాయింపు పొందవచ్చు. రూ. 5- 7.5 లక్షలకు 20 శాతం, రూ. 7.5-10 లక్షలకు 20 శాతం, రూ.10-12.5 లక్షలకు వరకు 30 శాతం, రూ. 12.5 నుంచి 15 లక్షలకు 30 శాతం, రూ.15 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం వరకు పన్ను విధిస్తారు.

పాత పన్ను స్లాబ్ నియమం

వయస్సు 60 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల మధ్య ఉండి, మీరు సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఉన్నట్లయితే రూ. 3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ. 3-5 లక్షలపై 5%, ఇందులో సెక్షన్ 87A కింద మినహాయింపు పొందవచ్చు. రూ. 5-10 లక్షలకు 20 శాతం పన్ను. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్నును వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ 80 ఏళ్లు పైబడి ఉంటే రూ. 5 లక్షల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే రూ.5-10 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పై30 శాతం పన్ను ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక కొత్త పన్ను శ్లాబ్ దీనికి భిన్నంగా ఉంటుంది. ఇందులో పన్ను రేటు తక్కువగా ఉంటుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ పెరిగేకొద్దీ, పన్ను బాధ్యత కూడా పెరుగుతుంది. ఇందులో, మీరు మినహాయింపు, మినహాయింపు ప్రయోజనాన్ని పొందలేరు. అయితే మీరు పాత పన్ను విధానంలో మినహాయింపు పొందవచ్చు. ఇక ఆదాయపు పన్ను రేటు గురించి తెలుసుకుందాం. రూ.2.5 లక్షల వరకు సంపాదిస్తే ఎలాంటి పన్ను ఉండదు. అదే రూ. 2.5 నుండి 5 లక్షల వరకు 5% పన్ను, సెక్షన్ 87A కింద మినహాయింపు పొందవచ్చు. రూ.5.7.5 లక్షలపై 10 శాతం, రూ.7.5 నుంచి 10 లక్షల వరకు 15 శాతం, రూ.10-12.5 లక్షలపై 20 శాతం, రూ. 12.5-15 లక్షలపై 25 శాతం, రూ. 15 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలి.

ఏ పన్ను స్లాబ్‌ని పాటించాలి

మీ వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువగా ఉండి మొత్తం ఆదాయం రూ. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే , మీ సంపాదన ప్రధానంగా జీతం నుండి వచ్చినట్లయితే, పాత పన్ను స్లాబ్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో మీరు ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు సీనియర్ సిటిజన్ కాకపోతే మీ మొత్తం ఆదాయం రూ. 5-6 లక్షలు ఉంటే, అప్పుడు కొత్త పన్ను స్లాబ్ ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి