AP: నీళ్లలో ఏవో తేలుకుంటూ వచ్చాయ్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు..

పుష్ప సీన్‌ రీపిట్‌ అయ్యింది. కాకపోతే రీల్‌సీన్‌కు రియల్‌ సీన్‌కు కాస్తా తేడా వచ్చింది. పుష్ప స్టైల్‌లోనే అల్లూరి జిల్లాలో స్మగర్లు ప్లాన్‌ వేశారు. పోలీసులు తెలివిగా వ్యవహరించడంతో స్మగ్లర్ల ప్లాన్‌ బెడిసింది కొట్టింది. ఇలా రిజర్వాయర్‌లో స్కార్పియో వెహికల్‌ దొరికింది.

AP: నీళ్లలో ఏవో తేలుకుంటూ వచ్చాయ్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు..
Ganja
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2022 | 12:11 PM

ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వాటి స్మగ్లింగ్‌ అధికారులకు, పోలీసులకు సవాల్‌గా మారుతోంది.  స్పెషల్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు బరితెగిస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు. పుష్ప(Pushpa) మూవీలో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించేందుకు హీరో అల్లు అర్జున్(Allu Arjun) వేసే ప్లాన్స్ షాకింగ్‌గా ఉంటాయి.  అంతకు మించిన ఐడియాలతో అధికారుల మైండ్ బ్లాంక్ చేస్తున్నారు గంజాయి స్మగ్లరు. పుష్ప సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా.. సేమ్‌ టు సేమ్‌ లెవల్‌లో… పెద్ద ఎత్తున గంజాయి(Cannabis)ని తరించేందుకు యత్నించి కేటుగాళ్లు బొక్కబోర్లా పడ్డారు. గంజాయిని తరలిస్తున్నారని సమాచారంతో మారేడుమిల్లి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఓ స్కార్పియో వాహనం అటుగా వచ్చింది. అయితే చెక్ పోస్ట్ దగ్గరువుతున్న కొద్దీ ఆ వాహనం స్పీడ్ పెరుగుతుంది. దీంతో పోలీసులు అలెర్టయ్యారు. ఆ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆ స్కార్పియో మరింత స్పీడ్‌తో దూసుకుపోయింది. దీంతో పోలీసులు తమ వెహికల్‌తో ఆ వాహనాన్ని వెంబడించారు. పోలీసులు ఫాలో అవుతుండటంతో..  గంజాయితో ఉన్న స్కార్పియో వాహనాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయరులోనికి దింపారు స్మగ్లర్లు. రిజర్వాయర్‌లో నీటి అడుగు భాగంలో గంజాయిని దాచేందుకు ప్రయత్నించారు.  పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఆపై ఆ వాహనంలోని ఒక వ్యక్తి పరారవ్వగా, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కార్పియోలో 300 కేజీలకు పైగా గంజాయి బస్తాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!