AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టా పరిచయం.. వాడ్ని నమ్మి ఇంత దూరం ఎలా వచ్చావమ్మా.. చివరకు సీన్ రివర్స్

ఒక అమ్మాయికి.. అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అనే వాళ్ళు పెద్దలు.. కానీ నేటి సమాజంలో ఏడు తరాలు అటు ఉంచి పరిచయమైన ఏడు రోజుల్లోనే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అందులోనూ ఇప్పటి యువత సోషల్ మీడియా.. ఇంస్టాగ్రామ్ మోజులో కేవలం ముఖ పరిచయం లేని వారిని సైతం పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇన్‌స్టా పరిచయం.. వాడ్ని నమ్మి ఇంత దూరం ఎలా వచ్చావమ్మా.. చివరకు సీన్ రివర్స్
Instagram Love
Ch Murali
| Edited By: |

Updated on: Mar 05, 2026 | 12:45 PM

Share

ఒక అమ్మాయికి.. అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అనే వాళ్ళు పెద్దలు.. కానీ నేటి సమాజంలో ఏడు తరాలు అటు ఉంచి పరిచయమైన ఏడు రోజుల్లోనే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అందులోనూ ఇప్పటి యువత సోషల్ మీడియా.. ఇంస్టాగ్రామ్ మోజులో కేవలం ముఖ పరిచయం లేని వారిని సైతం పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారం రోజుల క్రితం నెల్లూరు జిల్లా రాపూరు ప్రాంతంలో ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని వదిలి ఉండలేని ఓ వివాహిత ఆ యువకుడుతో కలిసి ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడింది. కేవలం కొన్ని నెలల ఇంస్టాగ్రామ్ పరిచయంతో.. ప్రేమలో పడిన ఆ వివాహిత తనకు తాళి కట్టిన భర్త కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలని మరిచిపోయి ఆ యువకుడుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది జరిగి వారం రోజులు గడవక ముందే ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి జిల్లాలు దాటి వచ్చింది. అయితే ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసం వచ్చిన ఆ యువతిని పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇంతకీ ఎవరా యువతి ఎక్కడి వచ్చింది. అనే వివరాలను తెలుసుకుందాం..

ముక్కు ముఖం తెలియని వ్యక్తులు నమ్మి నిత్యం చాలా మంది యువతులు, యువకులు మోసాల బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నా వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. సోషల్ మీడియా ప్రభావంతో తల్లిదండ్రులను కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలను సైతం వదిలేసి ఎదుటి వ్యక్తి ట్రాప్ లో పడిపోతున్నారు. తాజాగా విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్ చదివే యువతకి ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయమైన కొన్ని నెలలకే అతని ట్రాప్ లో పడిన యువతి అతని మాటలు నమ్మి ఏకంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇంట్లో పరీక్షకు వెళుతున్నానని చెప్పి వచ్చిన యువతి నేరుగా విశాఖలో బస్సు ఎక్కి కావలిలో దిగింది.

అయితే ఎంతసేపటికి ప్రేమించిన యువకుడు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆ యువతి కావలి పోలీసుల దృష్టిలో పడింది. దీంతో ఆ యువతిని స్టేషన్ తీసుకు వచ్చిన పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. తనకు ఇంస్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయం అయ్యాడని ఆ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు విశాఖ నుంచి కావలికి వచ్చినట్లు చెప్పడంతో ఆశ్చర్యపోయారు పోలీసులు.. ఇంస్టాగ్రామ్ లో పరిచయంతో జీవితం నాశనం చేసుకోవద్దని ఆయువతికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం