Adani: పంతం నెగ్గించుకున్న గౌతమ్ అదానీ.. భారీ డీల్ కు ఆ కంపెనీల కొనుగోలు.. పూర్తి వివరాలు..

Adani acquires Ambuja: గత కొంత కాలంగా అనేక కీలక వ్యాపారాల్లోకి అదానీ గ్రూప్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో అనేక ప్రముఖ కంపెనీలను హస్తగతం చేసుకునే పనిలో పడ్డారు ఛైర్మన్ గౌతమ్ అదానీ. తాజాగా..

Adani: పంతం నెగ్గించుకున్న గౌతమ్ అదానీ.. భారీ డీల్ కు ఆ కంపెనీల కొనుగోలు.. పూర్తి వివరాలు..
Adani
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 16, 2022 | 3:13 PM

Adani acquires Ambuja: గత కొంత కాలంగా అనేక కీలక వ్యాపారాల్లోకి అదానీ గ్రూప్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో అనేక ప్రముఖ కంపెనీలను హస్తగతం చేసుకునే పనిలో పడ్డారు ఛైర్మన్ గౌతమ్ అదానీ. తాజాగా దేశంలోని రెండు అతిపెద్ద సిమెంట్ కంపెనీలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్ కంపెనీలను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ కూడా బిడ్డింగ్ చేసింది. ఈ క్రమంలో స్విస్ కంపెనీ హోల్సిమ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు 81 వేల కోట్ల రూపాయలుగా ఉంది. అదానీ గ్రూప్ విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హోల్సిమ్ (Holcim) అంబుజా సిమెంట్స్‌ కంపెనీలో 63.19 శాతం వాటాను, ACC సిమెంట్స్ కంపెనీలో 54.3 శాతం వాటాను కలిగి ఉంది. ఈ రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 66 మెట్రిక్ టన్నులుగా ఉంది. రానున్న కాలంలో ఇది 78 MTకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ డీల్ ద్వారా అదానీ గ్రూప్.. దేశంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ మెటీరియల్స్ పరిశ్రమ రంగంలో అతి పెద్ద డీల్ చేసినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ సిమెంట్ ఇండస్ట్రీస్ పేరుతో గతేడాది సిమెంట్ వ్యాపారంలోకి అదానీ అరంగ్రేట్రం చేశారు. ఈ భారీ డీల్ తరువాత అదానీ గ్రూప్ దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా అవతరించనుంది. 1 ఆగస్టు 1936న ముంబైలో ఏసీసీ సిమెంట్ కంపెనీ ప్రారంభమైంది. అంబుజా సిమెంట్‌ కంపెనీని 1983లో నరోత్తమ్ సెఖ్‌సారియా, సురేష్ నియోటియా స్థాపించారు. Holcim కంపెనీ 17 ఏళ్ల కిందట మన దేశంలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా ఉంది.

అంబుజా సిమెంట్స్, ACC అద్భుతమైన తయారీ, స్లపై చెయిన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థతో పాటు మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి. ఈ కారణంగా అవి అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచాయి. ఈ రెండు కంపెనీలకు సంయుక్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, 50,000 కంటే ఎక్కువ ఛానెల్ భాగస్వాములను కలిగి ఉన్నాయి. ఈ కారణంగా కంపెనీ దేశంలో బలమైన వ్యాపారాన్ని కలిగి ఉంది. ఈ డీల్ తో అదానీ నిర్మాణ రంగంలో తిరుగులేని వ్యాపారవేత్తగా మారనున్నారు.

ఇవీ చదవండి..

Hyderabad: కారు నడపవద్దన్న భర్త.. మనస్తాపంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఎంత పని చేసిందంటే..

Mahindra Scorpio: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కోసం చూస్తున్నారా..? తక్కువ రేట్లలో కార్లు.. ధర.. ఫీచర్స్‌ వివరాలు