Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కారు నడపవద్దన్న భర్త.. మనస్తాపంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఎంత పని చేసిందంటే..

Hyderabad: ఇటీవల కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఆమె భర్త కారు నడపవద్దని చెప్పాడు. దీంతో ఆమె మానసిక వేదనకు గురైంది. ఈ ఒత్తిడితో ఎంతపని చేసిందంటే..

Hyderabad: కారు నడపవద్దన్న భర్త.. మనస్తాపంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఎంత పని చేసిందంటే..
Car
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 16, 2022 | 2:45 PM

Hyderabad: ఇటీవల కాలంలో మానసిక ఒత్తిడి, సమస్యలతో ఆత్మహత్య(Suicide) చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మానసికంగా తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లోని జేవీజీ హిల్స్‌ ఉబేర్‌ హైట్స్‌ లో నివాసముండే సుభాషిణి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. సుభాషిణికి చాలా కాలం క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఇంటర్‌ చదివే కుమారుడు ఉన్నాడు.

రెండు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుభాషిణిని కారు, బైక్‌ నడపవద్దని డాక్టర్లు సూచించారు. ఇటీవల కారు కొనుక్కున్న ఆమె కారు నడప వద్దని సూచించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

North Korea: కరోనా కేసులే లేవన్న కిమ్‌ కింగ్‌డమ్‌లో లక్షకు పైగా పాజిటివ్స్‌..పరిస్థితి చెప్పలేమంటున్న నిపుణులు

Lotus Benefits: బురదలో వికసించే తామరపువ్వుతో మైండ్ బ్లాంక్ అయ్యే బెనిఫిట్స్.. కనీసం మీరు ఊహించలేరు