AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie : రామాయణంలో సీత పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్.. చేస్తే మరోలా ఉండేదిగా..

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణం. డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్.. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూ్బ్ లో దూసుకుపోతుంది.

Ramayana Movie : రామాయణంలో సీత పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్.. చేస్తే మరోలా ఉండేదిగా..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2026 | 6:53 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా రామాయణం. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీని మొత్తం రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్టులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, శుర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ఇందులోని పాత్రలు, మేకోవర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఈ చిత్రం మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇదెలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

ఈ సినిమాలో సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రలో ఆమె రూపం, నటన అద్భుతమంటూ ఇదివరకే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే సీత పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్లను అడిషన్ చేశారట మేకర్స్. ముందుగా ఈ పాత్ర కోసం కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించారట. కానీ కొన్ని కారణాలతో ఈ పాత్రలోకి సాయి పల్లవిని తీసుకున్నారు. గతంలో ఈ విషయాన్ని శ్రీనిధి శెట్టి స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాను రిజెక్ట్ చేసేంత స్థాయి తనకు లేదని.. కేవలం అడిషన్ కు వెళ్లొచ్చానని.. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం తనకు తెలియదని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే.. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన హిట్ 3 చిత్రంలో నటించింది. ప్రస్తుతం వెంకీ నటిస్తున్న ఆదర్శ కుటుంబంలో నటిస్తుంది. ఇవే కాకుండా ఇప్పుడిప్పుడే ఈ అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

శ్రీనిధి శెట్టి పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

Follow Us