AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సల్మాన్ ఖాన్ మాట నిలబెట్టుకుంటారా?

సల్మాన్ ఖాన్ మాట నిలబెట్టుకుంటారా?

Samatha J
|

Updated on: Oct 06, 2026 | 11:17 AM

Share

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి సినిమా రిలీజ్ కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గల్వాన్ లోయ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, యాంటీ-చైనా టోన్ వల్ల ఆలస్యమైంది. స్క్రిప్ట్ లో మార్పుల తర్వాత ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఎన్ఓసీ లభించింది. ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది.

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ డ్రామా మాతృభూమి సినిమా విడుదలలో ఎదురైన సవాళ్లను అధిగమించింది. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రిలీజ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి, సినిమా విడుదల మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని సమాచారం. వాస్తవానికి, బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పేరుతో మొదలైన ఈ ప్రాజెక్ట్, ఆ తర్వాత మాతృభూమి మేవార్ రెస్ట్ ఇన్ పీస్ గా టైటిల్ మార్చుకుంది. 2020లో ఇండియా-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, కథలో ఉన్న బలమైన యాంటీ-చైనా టోన్ వల్ల విడుదల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారత్-చైనా మధ్య సున్నితమైన అంశాలను స్పృశించడంతో, ఆ సన్నివేశాలను పూర్తిగా మార్చాల్సి వచ్చింది.

Follow Us