AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఫించన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అమల్లోకి కొత్త విధానం..

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరి పింఛన్ ద్వారా వచ్చే మొత్తం డబ్బును నేరుగా లబ్ధిదారుడి చేతికి ఇవ్వకుండా అందులో కొంత భాగాన్ని అకౌంట్‌లోకి, మరికొంత భాగాన్ని లబ్ధిదారుడి చేతికి అందించనుంది. నవంబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.

లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఫించన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అమల్లోకి కొత్త విధానం..
Ap Pension Rules November 1
Anand T
|

Updated on: Oct 06, 2026 | 12:30 PM

Share

ఏపీలో పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వచ్చే నెల నుంచి పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇకపై గతంలో మాదిరి కాకుండా కొత్త విధానంలో పింఛన్ పంపిణీ జరుగుతుందని పేర్కొంది. అంటే ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా యాడ్ చేసి.. ఈ డబ్బును రెండు భాగాలుగా విభజించనుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ వాటా డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేసి.. రాష్ట్ర ప్రభుత్వం అందించే డబ్బును లబ్ధిదారుడికి నగదు రూపంలో ఇవ్వనుంది. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది.

చేతికి ఎంత, ఖాతాల్లోకి ఎంత వెళ్తోంది?

ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందిస్తున్న మొత్తం డబ్బులను అధికారులు నేరుగా లబ్ధిదారుల చేతికి అందిస్తున్నారు. కానీ నవంబర్ 1వ తేదీ నుంచి ఇందులో కొంత భాగాన్ని అకౌంట్లో జమ చేయనున్నారు. అంటే వృద్ధులకు ప్రతి నెలా రూ. 4,000 పింఛన్ వస్తే.. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అందించే రూ. 3,800లను అధికారులు లబ్ధిదారుల చేతికి అందిస్తారు. ఇక కేంద్రం వాటా కింద వచ్చే రూ. 200లను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. అలాగే దివ్యాంగులకు అందించే రూ. 6,000లలో రూ. 5,700 లబ్ధిదారుల చేతికి ఇస్తే.. రూ. 300 అకౌంట్లో జమ చేస్తారు.

బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

అయితే కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇచ్చే డబ్బు మీ ఖాతాలో జమ అవ్వాలంటే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కు కచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాల్సిందే. అలా లేకపోతే.. కేంద్రం వాటా కింద వచ్చే డబ్బులు మీకు రాకుండా పోతాయి. కాబట్టి పింఛన్లు పొందే ప్రతి ఒక్కరూ వెంటనే తమ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి లింక్ చేసుకోండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us