ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆయనతో కాఫీ డేట్‌కు వెళ్లాలని ఉంది.. దివి
Rajitha Chanti
Pic credit - Instagram
06 October 2026
బిగ్ బాస్ తెలుగు ఫేమ్, గ్లామరస్ బ్యూటీ దివి వైద్య సోషల్ మీడియాలోనూ, ఇంటర్వ్యూలలోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తనదైన స్టైల్, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ భామ, తాజాగా తన ఫేవరేట్ గురించి చెప్పుకొచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి వైద్యకు ప్రభాస్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. "నాకు డార్లింగ్ ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను
ఆయనంటే నాకు చాలా చాలా పిచ్చి, ఒకరకంగా ప్రాణం అని కూడా చెప్పవచ్చు" అని మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఆయనను ఎప్పుడు కలిసినా, ఆయన వ్యక్తిత్వానికి, ఆదరించే గుణానికి ఫిదా అయిపోతానని చెప్పింది. ఆయన ఇచ్చే రెస్పెక్ట్, చూపించే ఆప్యాయత వేరే లెవెల్‌లో ఉంటుందని అన్నారు.
ఒకవేళ ప్రభాస్ నాకు ఎదురుపడితే ఆయనతో కాఫీ డేట్ కు వెళ్లాలని ఉందని చెప్పుకొచ్చింది. ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనన్నారు.
చిన్న క్యారెక్టర్ అయినా సరే ఎగిరి గంతేసి చేస్తానని ఆమె తెలిపింది. గతంలో కూడా ప్రభాస్ డార్లింగ్ పట్ల తనకున్న అభిమానాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేసింది.
మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో చిన్న పాత్రతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కబాలి, గాడ్ ఫాదర్ రుద్రంగి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.