AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండపై కాసుల వర్షం.. ఏటేటా పెరుగుతున్న శ్రీవారి హుండీ ఆదాయం.. ఈ సారి 9 నెలల్లోనే..

కలియుగ వైకుంఠనాథుడు.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా టీటీడీ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఈ ఏడాది గడిచిన 9 నెలల్లోనే స్వామివారి హుండీ ద్వారా రూ. 1,129.04 కోట్ల మేర ఆదాయం టీటీడీ ఖజానాకు చేరింది. ముఖ్యంగా గత జులై నెలలో వచ్చిన ఆధారం టీటీడీ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది.

కొండపై కాసుల వర్షం.. ఏటేటా పెరుగుతున్న శ్రీవారి హుండీ ఆదాయం.. ఈ సారి 9 నెలల్లోనే..
Tirumala Hundi Income
Raju M P R
| Edited By: |

Updated on: Oct 06, 2026 | 11:20 AM

Share

అపర కుబేరుడు, కలియుగ వైకుంఠనాథుడు.. ఆయనకున్న ఆస్తులు, సంపద వెలకట్టలేనివి. అయినా నిత్యం భక్తులు సమర్పించే కానుకలతో ఆయన ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చి చేరుతోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం ఏటేటా పెరుగుతూ పాత రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా టీటీడీ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఈ ఏడాది గడిచిన 9 నెలల్లోనే స్వామివారి హుండీ ద్వారా రూ. 1,129.04 కోట్ల మేర ఆదాయం టీటీడీ ఖజానాకు చేరింది.

రోజుకు 75 నుంచి 80 వేల మంది దర్శనం

తిరుమలేశుడి మొత్తం రాబడిలో హుండీ ఆదాయమే అత్యంత కీలకం. భక్తుల రద్దీతో నిత్యం కిటకిటలాడే తిరుమల కొండపై.. సగటున రోజుకు దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు తమ మొక్కుల రూపంలో భారీగా కానుకలు సమర్పిస్తుండటంతో హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రతి నెలా సగటున రూ. 125 కోట్లకు పైగానే రాబడి వస్తుండటం విశేషం.

టీటీడీ చరిత్రలోనే సరికొత్త రికార్డు

ఈ ఏడాది వచ్చిన ఆదాయంలో జూలై నెల ఆదాయం టీటీడీ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచింది. జూలై 1 నుంచి 31 వరకు మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఏకంగా రూ. 140.25 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. గత రికార్డులన్నింటినీ అధిగమించి ఈ ఏడాదిలోనే అత్యధిక నెలవారీ ఆదాయంగా ఇది నమోదైంది.

నెలలవారీగా శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు

  • జనవరిలో రూ. 124.36 కోట్లు
  • ఫిబ్రవరిలో రూ. 110.92 కోట్లు
  • మార్చిలో రూ. 125.24 కోట్లు
  • ఏప్రిల్‌లో రూ. 115.84 కోట్లు
  • మేలో రూ. 120.28 కోట్లు
  • జూన్‌లో రూ. 128.30 కోట్లు
  • జూలైలో రూ. 140.25 కోట్లు
  • ఆగస్టులో రూ. 137.44 కోట్లు
  • సెప్టెంబర్‌లో రూ. 126.41 కోట్లు

సింగిల్ డే రికార్డులు ఇవే..

ఈ ఏడాది ఒకే రోజు అత్యధికంగా సెప్టెంబర్ 10వ తేదీన రూ. 6.94 కోట్ల హుండీ ఆదాయం రాగా, అత్యల్పంగా మార్చి 4వ తేదీన రూ. 1.47 కోట్ల ఆదాయం నమోదైనట్లు టీటీడీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా..
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా..
ఆ సినిమా మొత్తం నైటీలోనే చేశా..
ఆ సినిమా మొత్తం నైటీలోనే చేశా..
రెండు కాళ్లపై నిలబడి ఫేమస్.. 23 ఏళ్లకి గిన్నిస్ రికార్డు!
రెండు కాళ్లపై నిలబడి ఫేమస్.. 23 ఏళ్లకి గిన్నిస్ రికార్డు!
మహిళలు ముక్కుకు ఎడమ వైపునే ముక్కుపుడక ఎందుకు ధరిస్తారు?
మహిళలు ముక్కుకు ఎడమ వైపునే ముక్కుపుడక ఎందుకు ధరిస్తారు?
సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితం ఆయన చెప్పిందే నిజమైంది.. వీడియో
సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితం ఆయన చెప్పిందే నిజమైంది.. వీడియో
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే
ఆ హీరోయిన్‌ వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యా:ధురంధర్ డైరెక్టర్
ఆ హీరోయిన్‌ వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యా:ధురంధర్ డైరెక్టర్
చలికాలంలో ఈ లడ్డూలు పిల్లలకు తినిపిస్తే ఉక్కులా తయారవుతారు..
చలికాలంలో ఈ లడ్డూలు పిల్లలకు తినిపిస్తే ఉక్కులా తయారవుతారు..