AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Epic Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆనంద్, వైష్ణవి చైతన్య సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

ఇటీవల కాలంలో ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అలాగే డిఫరెంటే కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. ఇక వారం వారం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసే సినిమాల గురించి చెప్పక్కర్లేదు. అయితే ఈ వారం అలానే ఏకంగా 23కి పైగా చిత్రాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో తెలుగువి కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇఫ్పుడు ఓతెలుగు రొమాంటిక్ మూవీ డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

Epic Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆనంద్, వైష్ణవి చైతన్య సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Epic Movie
Rajitha Chanti
|

Updated on: Oct 06, 2026 | 12:37 PM

Share

‘బేబీ’ వంటి మైండ్ బ్లోయింగ్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (Epic – First Semester). సిరివెన్నెల ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 9, 2026 నుంచి ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఒక కుర్రాడు.. అక్కడ ఎదుర్కొన్న అనుభవాలు, లవ్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్, ఫస్ట్ సెమిస్టర్ లైఫ్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో పాటు సీనియర్ నటుడు శివాజీ, వాసుకి, కళ్యాణ్ శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

మొదటి భాగంలో వచ్చే విలేజ్ , అబ్రాడ్ కామెడీ సీన్లు, ఆనంద్-వైష్ణవిల మధ్య కెమిస్ట్రీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం (ముఖ్యంగా “సంచారమే” పాట) , తండ్రి-కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..

ఎపిక్ ఓటీటీ డేట్..

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

Follow Us