AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings Plan: రోజుకు రూ.20 పెట్టుబడితో రూ.3 లక్షలు మీకే.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా చూసి ఉండరు.. లోన్ కూడా పొందే ఛాన్స్..

చిన్న మొత్తంలో ప్రతీ నెలా డబ్బులు పొదుపు చేయాలనుకునేవారి కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఇండియా ఒక అద్బుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో రోజూ రూ.20 పెట్టుబడితో రూ.లక్ష, రూ.2 లక్షలు వరకు సంపాదించవచ్చు.

Savings Plan: రోజుకు రూ.20 పెట్టుబడితో రూ.3 లక్షలు మీకే.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా చూసి ఉండరు.. లోన్ కూడా పొందే ఛాన్స్..
Sbi
Venkatrao Lella
|

Updated on: Aug 01, 2026 | 7:00 PM

Share

ప్రముఖ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే సేవింగ్స్ స్కీమ్ తీసుకొచ్చింది. హర్ ఘర్ లక్షపతి పేరుతో ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. రికరింగ్ డిపాజిట్ రూపంలో ప్రతీ నెలా కొంతమొత్తంలో పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం పొందవచ్చు. రిస్క్ లేని పెట్టుబడితో పాటు క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునేవారి కోసం ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించారు. రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ నాటికి రూ.లక్షల వరకు పొందవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

హర్ ఘర్ లఖపతి’ పథకం అంటే ఏంటి?

ఇది ఎస్బీఐ ఆధ్వర్యంలో నడుస్తు్న్న ఒక రికరింగ్ డిపాజిట్ పథకం. పెట్టుబడి పెట్టాలనుకునేవారు ప్రతీ నెలా కొంత మొత్తంలో నగదు జమ చేయాలి. మెచ్యూర్ పీరియడ్ కంప్లీ్ట్ అయిన తర్వాత మీరు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు ఒకేసారి పొందవచ్చు. మీరు జమ చేసిన సొమ్ము పూర్తి సురక్షితంగా ఉంటుంది. ఎస్బీఐ ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం మీకు నిధులు అందుతాయి. మూడు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి నిర్ణయించుకోవచ్చు. మీరు ఎంచుకున్న కాలపరిమితిని బట్టి ప్రతీ నెలా ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తారు. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే నెలవారీ చెల్లించే డబ్బులు తక్కువగా ఉంటాయి. అదే తక్కువ కాలపరిమితి ఎంచుకుంటే చెల్లించాల్సిన సొమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇక వడ్డీ రేట్లలో మార్పుల వల్ల నెలవారీ చెల్లించే సొమ్ములో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు.

వడ్డీ రేట్లు ఎంతంటే..?

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇందుకు వర్తిస్తాయి. సాధారణ కస్టమర్లకు వార్షిక వడ్డీ 6.50 శాతం నుంచి 6.75 శాతం మధ్య ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ ఎస్బీఐ అందిస్తోంది. సింపుల్‌గా ఆన్లైన్‌లో లేదా బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి ఈ అకౌంట్ తెరవొచ్చు. కేవలం ఆధార్, పాన్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఇక ఒక ఆర్ధిక సంవత్సరంలో లభించిన వడ్డీ రూ.40 వేలు దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఇక మీకు అవసరమైతే ఈ డిపాజిట్లపై రుణం లేదా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు. ఏ నెలలోనైనా మీ వాయిదాను సకాలంలో చెల్లించకపోతే నిబంధనల ప్రకారం బ్యాంకు జరిమానా విధించవచ్చు. వరుసగా అనేక వాయిదాలు చెల్లించకపోతే మీ ఖాతాను మూసివేయవచ్చు.

Follow Us
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?