Steel Prices: ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన స్టీల్ ధరలు.. టన్ను ధర ఎంతంటే..

Steel Prices: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నుంచి పూర్తయిన ఉక్కు ఉత్పత్తి క్షీణించడం ప్రారంభించింది. గృహ నిర్మాణదారులకు తగ్గుతున్న స్టీల్ ధరలు మరింత ఊరటను కలిగిస్తున్నాయి.

Steel Prices: ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన స్టీల్ ధరలు.. టన్ను ధర ఎంతంటే..
Steel
Follow us

|

Updated on: May 16, 2022 | 8:31 PM

Steel Prices: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నుంచి పూర్తయిన ఉక్కు ఉత్పత్తి క్షీణించడం ప్రారంభించింది. అధిక ఇన్‌పుట్ కాస్ట్ కారణంగా స్టీల్ సెక్టార్ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. లాంగ్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్‌లో ధరలు కోల్‌కతా మార్కెట్‌లో టన్నుకు గరిష్టంగా రూ. 65,000 నుంచి రూ. 57,000కి సగటున 10-15 శాతం మేర తగ్గాయి. సెకండరీ స్టీల్ ఉత్పత్తిదారులకు కీలకమైన ముడిసరుకు బొగ్గు. దాని కొరత, పెరిగిన రేటు కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారాయి. దేశంలోని నిర్మాణ రంగంపై పెరిగిన ఉక్కు, సిమెంట్ ధరలు భారీ భారాన్ని మోపుతున్నాయి. గరిష్టంగా టన్ను ఉక్కు ధర దాదాపు 75 వేల నుంచి 76 వేల వరకు చేరుకుంది.

స్టీల్ ఉత్పత్తులు, TMT బార్లు.. నిర్మాణాలు మందగించిన కారణంగా 10, 15 శాతం మధ్య తగ్గాయి. ఈ రేట్లు రానున్న కాలంలో మరింతగా తగ్గుతాయని స్టీల్ రోలింగ్ మిల్స్ అసోసియేషన్ ఛైర్మన్ వివేక్ అదుకియా అన్నారు. ఇన్‌పుట్‌ ఖర్చులు సైతం 50 శాతం పెరగటం, స్పాంజ్ ఐరన్ తయారీకి వినియోగిెంచే అధిక నాణ్యత గల థర్మల్ బొగ్గు టన్నుకు 120 డాలర్ల వరకు పెరగటం అధిక ధరలకు మరో కారణంగా తెలుస్తోంది. యుద్ధం కారణంగా టన్ను బొగ్గు 300 డాలర్లకు చేరుకుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రానున్న కాలంలో ఉక్కు ధర టన్నుకు 60 వేల వరకు తగ్గుతుందని వారు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ప్రభుత్వాలు నిర్మాణాలను పెంచటం వల్ల ఏర్పడిన డిమాండ్ కూడా ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పెరిగిన బొగ్గు ధరలు ఖర్చులు.. దేశంలో పెరిగిన ఉక్కు ధరల వల్ల కవర్ అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మార్చి 2023 నాటికి టన్ను ఉక్కు ధర రూ. 60,000కి తగ్గుతాయని కౌస్తవ్ మజుందార్ అంటున్నారు. బొగ్గు విషయంలో కోల్ ఇండియా నిర్ణయాన్ని మార్చుకోవాలని పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు తగ్గకపోతే.. 30-40 శాతం సెకండరీ స్టీల్ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించాలి లేదా మూసివేయవలసి ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 65 సెకండరీ యూనిట్లు ఉన్నాయి. అవి సుమారు లక్ష మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి.