LIC IPO Listing: ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఎల్ఐసీ లిస్టింగ్ ఈరోజే.. తక్కువ రేటుకే మార్కెట్లోకి వచ్చే అవకాశం..!

LIC IPO Listing: దేశంలో చాలా మంది ఇన్వెస్టర్లు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీవో నేడు స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టింగ్ కానుంది. దాదాపు 21 వేల కోట్ల రూపాయలు విలువైన ఈ ఇష్యూ ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో అందుబాటులోకి రానుంది.

LIC IPO Listing: ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఎల్ఐసీ లిస్టింగ్ ఈరోజే.. తక్కువ రేటుకే మార్కెట్లోకి వచ్చే అవకాశం..!
Lic Ipo
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 17, 2022 | 7:50 AM

LIC IPO Listing: దేశంలో చాలా మంది ఇన్వెస్టర్లు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీవో నేడు స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టింగ్ కానుంది. దాదాపు 21 వేల కోట్ల రూపాయలు విలువైన ఈ ఇష్యూ ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో అందుబాటులోకి రానుంది. చాలా మంది పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు, ఇతర తరగతులకు చెందిన పెట్టుబడిదారులు పాల్గొన్న అతిపెద్ద ఐపీవో ఊహించిన దానికి భిన్నంగా ఉండనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు ఒక్కో షేర్ వెయ్యి రూపాయలకు లోపు ధరకే లిస్ట్ అయ్యే అవకాశం ఉందని అనేక సెక్యూరిటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనికి గ్రే మార్కెట్ ప్రీమియం తక్కువగా ఉండటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. చాలా మంది ఈ ఐపీవో రూ.910- రూ.920 మధ్యలో లిస్ట్ అవ్వవచ్చని అంచానా వేస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నట్లయితే షేర్ రూ.970- రూ.980 మధ్య రేటులో లిస్ట్ కావచ్చని తెలుస్తోంది.

ఈ రోజు బుల్ మార్కెట్ ఉన్నట్లయితే 3-4 శాతం ప్రీమియం రేటుకు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ మార్కెట్ బేరిష్ గా ఉన్నట్లయితే షేర్ 5 శాతం డిస్కౌంట్ ధరకు.. అంటే షేర్ ఇష్యూ కంటే తక్కువ రేటుకు స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం సైతం రూ.28 డిస్కౌంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి కారణంగా హై ఓలటాలిటీ, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆ ప్రభావం ఎల్ఐసీపై పడటం వల్ల షేర్ ఫ్లాట్ లిస్టింగ్ అంటే పెద్దగా లాభాలు లేకుండానే ట్రేడ్ అవ్వవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లిస్టింగ్ ఆరంభంలో నష్టాలను చూసి ఇన్వెస్టర్లు అందోళన చెందవద్దని.. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడి మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు సైతం అంటున్నాయి. దేశంలోని ఇన్సూరెన్స్ వ్యాపారంలో దిగ్గజంగా ఎల్ఐసీ ఉన్నందున తాత్కాలికంగా షేర్ల విలువ పతనమైనా.. భవిష్యత్తులో అది మంచి రాబడిని అందిస్తాయని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

2021లో దిమ్మతిరిగే వృద్ధిని సాధించిన భారతీయ IPO మార్కెట్ ఈ సంవత్సరం గణనీయమైన మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఇది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ అస్థిరత, ఇటీవలి IPOల నుంచి అధిక-విలువైన స్టాక్‌లలో ధరల సవరణ, అలాగే పెరుగుతున్న వస్తువుల ధరలు, ఇంధన ధరలు, ఆర్థిక వృద్ధి నెమ్మదించటం వంటి కారణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.