Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Support India: ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన చైనా.. G7 దేశాలపై విమర్శలు.. ఎందుకంటే..

China Support India: ఎప్పుడూ భారత్ పై(India) డ్రాగన్ దేశం నిప్పులు కక్కడం మాత్రమే మనం చూశాం. కానీ.. ఈ సారి చైనా భారత్ తీసుకున్న విషయానికి సపోర్ట్ గా నిలిచింది. విషయం ఏమిటంటే..

China Support India: ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన చైనా.. G7 దేశాలపై విమర్శలు.. ఎందుకంటే..
China
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 16, 2022 | 6:46 PM

China Support India: ఎప్పుడూ భారత్ పై(India) డ్రాగన్ దేశం నిప్పులు కక్కడం మాత్రమే మనం చూశాం. కానీ.. ఈ సారి చైనా భారత్ తీసుకున్న విషయానికి సపోర్ట్ గా నిలిచింది. గోధుమల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంపై పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా భారత్‌కు రక్షణగా నిలిచింది. చైనా ప్రభుత్వ మౌత్‌పీస్ అయిన గ్లోబల్ టైమ్స్‌లో(Global Times) మన దేశానికి అండగా నిలుస్తూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జీ-7 దేశాల తీరును చైనా తప్పుపట్టింది. చైనా భారత్ కు అండగా నిలవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భారత్ ను విమర్శించే పనిలో ఉన్న సదరు పాశ్చాత్య దేశాలు ఎగుమతులను ఎందుకు పెంచుకోలేదు, ఆహార మార్కెట్ సరఫరాను ఎందుకు స్థిరీకరించలేదంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రతి దేశమూ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులను విధించడం లేదా మార్కెట్లను మూసివేయడం ప్రారంభిస్తే.. అది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని జర్మన్ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ మీడియాతో అన్నారు.

G7 పనితీరు పేలవంగా ఉందని గ్లోబల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానంలో ఉండగా.. ప్రపంచ గోధుమల ఎగుమతుల్లో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉంది. అమెరికా, కెనడా, EU, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు ప్రధాన గోధుమ ఎగుమతిదారుల్లో కొన్ని అని పేర్కొంది. ప్రపంచవ్యాప్త ఆహార సంక్షోభం కారణంగా కొన్ని పాశ్చాత్య దేశాలు గోధుమల ఎగుమతులను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పుడు.. భారీ జనాభాను పోషించడానికి స్వంత ఆహార సరఫరాను సురక్షితంగా ఉంచుకోవడానికి భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత్ ను విమర్శించటం సరికాదని తన వ్యాసంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్ సంక్షోభం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలే గ్లోబల్ మార్కెట్లో ఆహార ధరలు, ఆహార సరఫరా కొరతకు ప్రధాన కారణంగా చైనా పత్రిక పేర్కొంది. భారత్‌ను నిందించడం ఆహార సమస్యను పరిష్కరించదని.. భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై నింద మోపాలని పశ్చిమ దేశాలు కోరుకుంటున్నాయని అంది. ఆహార సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకున్న ధాన్యంపై ఆధారపడటాన్ని తగ్గించాలని అభిప్రాయపడింది. యూఎస్, దాని మిత్రదేశాలు తమ ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయంది. దాని ఫలితంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చైనా పత్రిక ఘాటు విమర్శలు చేసింది.