AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swati Dhingra: భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో కీలక బాధ్యతలు..

Swati Dhingra: భారత సంతతి మహిళకు మరో అరుదైన అవకాశం లభించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (UK) వడ్డీ రేట్లను నిర్ణయించే కమిటీలో విద్యావేత్త, ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ స్వాతి ధింగ్రా సభ్యురాలుగా నియమితులయ్యారు.

Swati Dhingra: భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో కీలక బాధ్యతలు..
Swati Dhingra
Ayyappa Mamidi
|

Updated on: May 16, 2022 | 9:12 PM

Share

Swati Dhingra: భారత సంతతి మహిళకు మరో అరుదైన అవకాశం లభించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో(UK) వడ్డీ రేట్లను నిర్ణయించే కమిటీలో విద్యావేత్త, ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ స్వాతి ధింగ్రా సభ్యురాలుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో నియమితులైన మొదటి భారతీయ సంతతి మహిళగా స్వాతి ధింగ్రా చరిత్ర సృష్టించారు. ధింగ్రా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఇంటర్నేష్నల్ ఎకనమిక్స్, అప్లైడ్ మైక్రోఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్ కలిగి ఉన్నారు. స్వాతి ధింగ్రా ఢిల్లీ యూనివర్శిటీలో చదివి.. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ పట్టా పొందారు. మానిటరీ పాలసీ కమిటీలో మూడేళ్ల కాలానికి ఆగస్టు 9, 2022న చేరనున్నారు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ UK ద్రవ్య విధాన నిర్వహణ గురించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు, ద్రవ్య విధానానికి బాధ్యత వహించే బ్యాంక్ సభ్యుడు, ఛాన్సలర్ నియమించిన నలుగురు బాహ్య సభ్యులు ఉంటారు. UK ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ రిషి సునక్ గత వారం ఆమె నియామకాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ స్వాతి ధింగ్రా అనుభవం MPCకి విలువైన కొత్త నైపుణ్యాన్ని తీసుకురానుంది. కరోనా మహమ్మారి, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సవాళ్ల మధ్య కమిటీ పనితీరు చాలా ముఖ్యమైనదిగా మారనుంది.

ఆమె యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ నుంచి MS, PhDని పూర్తి చేసింది. గతంలో UK ట్రేడ్ మోడలింగ్ రివ్యూ ఎక్స్‌పర్ట్ ప్యానెల్, LSE ఎకనామిక్ డిప్లొమసీ కమిషన్‌లో సభ్యురాలిగా స్వాతి పనిచేశారు. ఆమె ప్రస్తుతం రాయల్ మింట్ మ్యూజియం డైరెక్టర్, “ది ఎకానమీ 2030 ఎంక్వైరీ” పరిశోధన ప్రాజెక్ట్ కోసం స్టీరింగ్ గ్రూప్ సభ్యురాలుగా ఉన్నారు. MPCలోని ప్రతి సభ్యుడు ఆర్థిక శాస్త్రం మరియు ద్రవ్య విధాన రంగంలో నైపుణ్యం కలిగి ఉంటారు. స్వతంత్రంగా ఉంటారు. సలహాదారుల బృందం సునక్‌కి చేసిన సిఫార్సుల ఆధారంగా నియమాలకు అనుగుణంగా ధింగ్రా నియామకం జరిగినట్లు తెలుస్తోంది.