Hyderabad: ట్రాఫిక్ పోలీసుల కొత్త ప్రయత్నం.. ఇకపై వాట్సాప్‌కే ట్రాఫిక్ చలాన్ వివరాలు..

Traffic Challan: ట్రాఫిక్ చలాన్ విషయంలో హైదరాబాద్ పోలీసులు నూతన టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు. దీని ప్రకారం వాహనదారులకు తమ వెహికల్ కు సంబంధించిన చాలాన్ల అప్ డేట్ నేరుగా వాట్సాప్ కు పంపేందుకు సిద్ధమైంది.

Hyderabad: ట్రాఫిక్ పోలీసుల కొత్త ప్రయత్నం.. ఇకపై వాట్సాప్‌కే ట్రాఫిక్ చలాన్ వివరాలు..
Whatsapp
Follow us

|

Updated on: May 17, 2022 | 7:08 AM

Traffic Challan: ట్రాఫిక్ చలాన్ విషయంలో హైదరాబాద్ పోలీసులు నూతన టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు. దీని ప్రకారం వాహనదారులకు తమ వెహికల్ కు సంబంధించిన చాలాన్ల అప్ డేట్ నేరుగా వాట్సాప్ కు పంపేందుకు సిద్ధమైంది. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారులు తమ చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను అందిస్తారు. ఇందులోని మెుబైల్ నంబర్ కు ఈ-చలాన్ వివరాలను పోలీసులు ఇకపై పంపుతారు. సాధారణంగా గతంలో వాహనదారులు ఈ వివరాలు తెలుసుకోవటానికి పోలీసు ఈ-చలాన్ పోర్టల్ లో చెక్ చేసుకోవలసి వచ్చేంది. ఇప్పుడు నేరుగా ఆ వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకుంటే.. చలానాలు పెండింగ్ లేకుండా వెంటనే చెల్లించవచ్చు. ఈ చెల్లింపులను ఆన్ లైన్లో, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్ లో, మీ సేవలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. వాహన యజమానులందరికీ ఈ- మెయిల్ ఉండకపోవటం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విధానంలో.. ఎవరైనా వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అందుకు సంబంధించిన చలాన్ సందేశాన్ని వారి వాట్సాప్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫార్వార్డ్ చేస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఈ-చలాన్ విభాగంలోని పోలీసుల బృందం ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఈ-చలాన్ పోర్టల్‌లో ట్రాఫిక్ జరిమానాలను అప్‌డేట్ చేస్తుంది. ఈ క్రమంలో వాహన యజమాని మొబైల్ ఫోన్‌కు ముందుగా చలాన్ వివరాలతో కూడిన మెసేజ్ పంపి.. తర్వాత పోస్టల్ చలాన్ కూడా పంపిస్తారు. అయితే.. తాజాగా వాట్సాప్ ద్వారా కూడా చలానాను పంపిస్తున్నారు. మరో వైపు ఇప్పటికే వసూలు కావలసిన ట్రాఫిక్ చలాన్ల సొమ్మును రికవరీ చేసేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో వాహనదారులకు భారీ మెుత్తంలో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. చాలా మంది దీనిని వినియోగించుకుని చెల్లింపులు చేయటం ద్వారా ప్రభుత్వ ఖజానాకు మార్చి నెలలో భారీ మెుత్తంలో ఆదాయం వచ్చింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!