KTR: విదేశీ పర్యటనకు మంత్రి కేటీఆర్.. లండన్, స్విట్జర్లాండ్‌లో 10 రోజుల పాటు..
KTR: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు (మంగళవారం) విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు కేటీఆర్ లండన్‌తో పాటు స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు...
KTR: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు (మంగళవారం) విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు కేటీఆర్ లండన్‌తో పాటు స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ భారీ పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన ఉండనుంది. విదేశీ పర్యటనలో భాగంగా కేటీఆర్ మొదట మంగళవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి బయలుదేరి లండన్‌కు చేరుకోనున్నారు.
మే 17 నుంచి 21 వరకు లండన్‌లో పర్యటించనున్న కేటీఆర్, ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంత్రి పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న మంత్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, సీఈవోలతో సమావేశం కానున్నారు.
ఈ పర్యటనలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనుంది. కేటీఆర్ తిరిగి మే 26 సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ 12 ఏళ్ల తర్వాత లండన్‌లో పర్యటిస్తుండంతో వెస్ట్ లండన్‌లోని పలు ప్రాంతాల్లో కేటీఆర్‌కు స్వాగతం పలుకతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..